కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర ప్రారంభం
ABN , First Publish Date - 2023-02-21T23:32:54+05:30 IST
కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర మహోత్సవాలను మంగళవారం కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, జయమంగళ వెంకటరమణ ప్రారంభించారు. ప్రతిఏటా ఫాల్గుణ ఫాడ్యమి రోజున అమ్మవారి జాతర ప్రారంభమవుతుందని ఆలయ ఈవో గోపాలరావు తెలిపారు.
ఆకివీడురూరల్, ఫిబ్రవరి 21 : కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర మహోత్సవాలను మంగళవారం కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, జయమంగళ వెంకటరమణ ప్రారంభించారు. ప్రతిఏటా ఫాల్గుణ ఫాడ్యమి రోజున అమ్మవారి జాతర ప్రారంభమవుతుందని ఆలయ ఈవో గోపాలరావు తెలిపారు. అమ్మవారికి ఎమ్మెల్యే దంపతులు పట్టు వస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈనెల 21 నుంచి మార్చి ఏడో తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. మార్చి మూడో తేదీన శ్రీగోకర్ణేశ్వరస్వామికి, జలదుర్గా అమ్మవారికి కల్యాణం నిర్వహిస్తారని తెలిపారు. దేవస్థానం చైర్మన్ పులవర్తి లక్ష్మణబాబు, రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ సైదు గాయత్రి, పేటేటి పరమేశ్వరరావు, జడ్పీటీసీ కురెళ్ళ బాబి, కొల్లేరు నాయకులు పాల్గొన్నారు.