రేపు కిసాన్‌ మేళా

ABN , First Publish Date - 2023-03-28T00:29:14+05:30 IST

రైతు ఆరుగాలం శ్రమించి పండిస్తేనే మనకు ఆహారం లభిస్తుంది. రైతుకు ఏ రకం వరి వంగడాలను పండించాలి ? ఎటువంటి సస్య రక్షణ చర్యలు చేపట్టాలి ? వంటి విషయాలపై అన్నదా తలకు తోడుగా నిలుస్తోంది మార్టేరు వరి పరిశోధనా స్థానం.

రేపు కిసాన్‌ మేళా
మార్టేరు వరి పరిశోధనా కేంద్రం

పెనుమంట్ర, మార్చి 27 : రైతు ఆరుగాలం శ్రమించి పండిస్తేనే మనకు ఆహారం లభిస్తుంది. రైతుకు ఏ రకం వరి వంగడాలను పండించాలి ? ఎటువంటి సస్య రక్షణ చర్యలు చేపట్టాలి ? వంటి విషయాలపై అన్నదా తలకు తోడుగా నిలుస్తోంది మార్టేరు వరి పరిశోధనా స్థానం. రైతుల స్వర్ణ దేవాలయంగా పిలుచుకునే మార్టేరు వరి పరిశోధన కేంద్రం ఉభయ గోదావరి జిల్లాల రైతాంగంతో పాటు వివిధ జిల్లాల రైతులందరికీ సేవలందిస్తున్నది. ఈనెల 29న కేంద్రంలో కిసాన్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జి ఏడీఆర్‌ డాక్టర్‌ టి.శ్రీనివాస్‌ తెలిపారు. ఈ కిసాన్‌ మేళాలో అభివృద్ధి పరచిన నూతన వరి వంగడాలు, ఆధునిక యంత్రాలు, ఇతర సాంకేతిక పద్ధతులు ప్రద ర్శింపజేసి వాటిని క్షేత్రస్థాయిలో సందర్శన కార్యక్రమాలు, రైతులు శాస్త్రవే త్తలతో ముఖాముఖి వంటి కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తామని తెలిపారు. కిసాన్‌ మేళాకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, శాసన మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు, పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగ నాథరాజు, ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఉప కులపతి విష్ణువర్ధన్‌ రెడ్డి, పలువురు శాస్త్రవేత్తలు పాల్గొంటారని తెలిపారు.

Updated Date - 2023-03-28T00:29:14+05:30 IST