Share News

ఉత్సాహంగా కార్తీక వనసమారాధనలు

ABN , First Publish Date - 2023-12-10T23:46:56+05:30 IST

జిల్లాలో పలు చోట్ల కార్తీక వనసమారా ధనలు ఆదివారం ఉత్సాహంగా నిర్వహించారు.

ఉత్సాహంగా కార్తీక వనసమారాధనలు
తణుకు శెట్టి బలిజ కార్తీక వనసమారాధనలో జెండా ఊపుతున్న ఆరిమిల్లి

ఆకివీడు/పాలకోడేరు డిసెంబరు : జిల్లాలో పలు చోట్ల కార్తీక వనసమారా ధనలు ఆదివారం ఉత్సాహంగా నిర్వహించారు. ఆకివీడులోని స్థానిక గౌడ–శెట్టి బలిజ కల్యాణమందిరంలో వనసమారాధన, స్వర్ణకార సంఘం నేతలు స్థానిక వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో, సాయిదుర్గానగర్‌లో కార్తీక వనసమారాధన నిర్వహించారు. ఎమ్మెల్యే మంతెన రామరాజు, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎల్‌ నరసింహరాజు, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి జుత్తిగ నాగరాజు, తదితరులు ఉన్నారు. పాలకోడేరు మండలం గొల్లలకోడేరు కాళీమాత ఆలయం వద్ద ఆర్యవైశ్యుల సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధన నిర్వహించారు. ఆటపాటలతో చిన్నారులు నృత్యాలతో అలరించారు.

పెనుమంట్ర/పోడూరు/ఆచంట : పెనుమంట్ర మండలం పెనుమంట్ర గ్రామంలో క్షత్రియ వన భోజనాల కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు ఆధ్వర్యంలో జరిగింది. దాట్ల భీమరాజు కొబ్బరితోటలో ఉసిరి చెట్టుకు పూజలను దాట్ల విశ్వనాథరాజు–విజయలక్ష్మి దంపతులు నిర్వహించారు. దాట్ల కృష్ణంరాజు, దాట్ల రామరాజు, రంగావతి, పెనుమంట్ర ఉప సర్పంచ్‌ భూపతిరాజు శ్రీనివాసరాజు తదితరులు ఉన్నారు. మార్టేరులో రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక్‌ వన సమారాధన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ విచ్చేశారు. రెడ్డి సేవా సంఘం అధ్యక్షుడు కోణాల కోదండ చంద్రశేఖర్‌రెడ్డి, తేతలి రాజారెడ్డి, వెలగల మల్లికార్జున్‌రెడ్డి కోణాల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోడూరు మండలం పెనుమదంలో గౌడ శెట్టిబలిజ కులస్థులు వనసమారాధన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా 14 పాలెంల పెనుమదం గౌడ శెట్టిబలిజ పెద్దల సంఘం అధ్యక్షుడు కవురు నర్శింహమూర్తి పాల్గొన్నారు. కవురు నర్శింహమూర్తి దంపతులు కార్తీక పూజలు నిర్వహించారు. సంఘ ఉపాధ్యక్షుడు బొంతు నాగరాజు, కోశాధికారి గుబ్బల లక్ష్మీనారాయణ, కార్యదర్శి బొక్కా సత్యనారాయణ పాల్గొన్నారు. ఆచంట మండలంలోని పలు గ్రామాల్లో కార్తీక వనసమారాధనలు జరిగాయి. ఆయా గ్రామాల్లో సందడి నెలకొంది.

పాలకొల్లు టౌన్‌/పాలకొల్లు రూరల్‌ : సమాజంలో కార్తీక వనసమారాధనలు నిర్వహించు కోవడం మంచి సంప్రదాయమని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయు డు అన్నారు. స్థానిక క్షత్రియ కల్యాణ మండపంలో క్షత్రియుల ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వనసమారాధనలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో జరిగిన శ్రీకృష్ణయాదవ సంఘ వనసమారాధనలోనూ, శ్రీకృష్ణదేవరాయ సంఘ వనసమారాధనలోనూ, తెలుకుల సంఘ వనసమారాధనలోనూ పాల్గొన్నారు. పాలకొల్లులోని కాకతీయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన ఆధివారం స్ధానిక ఎస్‌.కన్వెన్షన్‌లో సంఘ నాయకులు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, మహిళలు ఆటపాటలతో అలరించారు. పలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

తణుకు : అందరూ అభివృద్ధి సాధించాలని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. ఆదివారం శెట్టిబలిజ, కాపు సంఘాల కార్తీక వనసమారా ధనలో ఆయన పాల్గొన్నారు. బీసీ కల్యాణ మండపంలో డాక్టర్‌ దొమ్మేటి వెంకట సుధాకర్‌, బాలం సుధీర్‌ ఆధ్వర్యంలో జరిగిన వనసమారా ధనలో శెట్టి బలిజ సేవా సంఘ సభ్యులు పాల్గొన్నారు. సజ్జాపురం అండర్‌ పాస్‌ వద్ద జరిగిన కాపు వనసమారాధనలో కాపు సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

నరసాపురం టౌన్‌/మొగల్తూరు: పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఆదివారం ఆర్యవైశ్య కార్తీక వన సమారాధన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. లయన్స్‌ క్లబ్‌ భవనంలో అగ్నికులక్షత్రియ కార్తీక వన సమారాధన, మొగల్తూరు మండల విశ్వబ్రాహ్మణులు, గాయత్రీ బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో మొగల్తూరులో ఘనంగా కార్తీక వన సమారాధనలు నిర్వహించారు. మొగల్తూరు జాతీయ రహదారి పక్క స్థలంలో విశ్వబ్రాహ్మణులు వన సమారాధన నిర్వహించారు. జిల్లా కార్యదర్శి శివశ్రీ, మండల సంఘ అధ్యక్షుడు చింతోజ్‌ పాండురంగారావు, నాగుమళ్ళ శ్రీనివాసరావు, ఆముదాలపల్లి వీరబాబు, జవ్వాది నాగేశ్వరరావు, ప్రకాశ్‌ తదితరులు ఉన్నారు. గాయత్రీ బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక శిష్టాసీతారామయ్య గృహ సముదాయంలో నిర్వహించగా పలు గ్రామాల నుంచి బ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

భీమవరంటౌన్‌ : అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని రాష్ట్ర వైసీపీ యువత నాయకుడు గ్రంధి రవితేజ అన్నారు. పంచారామ క్షేత్రమైన గునుపూడి సోమేశ్వర స్వామి ఆలయానికి కార్తీక మాసం సందర్భంగా వచ్చే భక్తులకు ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నసమారాధనను ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. కార్తీక మాసంలో ఆలయానికి వచ్చే భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించేందుకు తమ కుటుంబం100 క్వింటాళ్ల బియ్యాన్ని అన్నపూర్ణమ్మ అమ్మవారి మొక్కుబడి లో భాగంగా అందజేశామన్నారు.

తాడేపల్లిగూడెం రూరల్‌ : తాడేపల్లిగూడెం నియోజకవర్గ కాపు వర్గీయు ల కార్తీక వనసమారాధన ఆదివారం వెంకట్రామన్నగూడెంలో నిర్వహించారు. కాపు సంఘ సభ్యులు తమ కుటుంబాలతో వచ్చి ఉల్లాసంగా గడిపారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, నియోజకవర్గ జనసేన, టీడీపీ ఇన్‌చార్జ్‌లు బొలిశెట్టి శ్రీనివాస్‌, వలవల బాబ్జి, మాజీ ఎమ్మెల్యే ఈలి నాని, బీజేపీ కన్వీనర్‌ ఈతకోట తాతాజీ తదితరులు ప్రసంగించారు. కాపు సంఘ నాయకులు మారిశెట్టి అజయ్‌, మాకా శ్రీనివాస్‌, గుండుబోగుల నాగు తదితరులు ఉన్నారు.

గణపవరం : కిరాణా మర్చంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీకృష్ణ ఆలయ ప్రాంగణంలో కార్తీక వనసమారాధన ఉత్సాహంగా జరిగాయి. వ్యాపారులు తమ కుటుంబ సభ్యులతో ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించారు. చిన్నారులు, మహిళలకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. బి.మల్యాద్రి యాదవ్‌, చేగు సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-10T23:46:57+05:30 IST