కక్ష కట్టి..ప్రాసిక్యూట్‌

ABN , First Publish Date - 2023-07-21T00:38:45+05:30 IST

జనసేనాధిపతి పవన్‌ కల్యాణ్‌ను ప్రాసిక్యూట్‌ చేయాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయించింది. ఇటీవలే ఉమ్మడి పశ్చిమ పర్యటనలో పవన్‌ కల్యాణ్‌కు లభించిన జనాదరణ చూసి ఓర్వలేకే సర్కార్‌ ఇలాంటి దుందుడుకు చర్యలకు దిగు తోందంటూ జన సైనికులు విరుచుకుపడుతున్నారు

కక్ష కట్టి..ప్రాసిక్యూట్‌

పవన్‌పై ప్రభుత్వ జీవో..

విరుచుకుపడిన జనసైన్యం

జగన్‌ సర్కార్‌ ఏం చేసినా జనసేన

లొంగదని హెచ్చరిక

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

జనసేనాధిపతి పవన్‌ కల్యాణ్‌ను ప్రాసిక్యూట్‌ చేయాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయించింది. ఇటీవలే ఉమ్మడి పశ్చిమ పర్యటనలో పవన్‌ కల్యాణ్‌కు లభించిన జనాదరణ చూసి ఓర్వలేకే సర్కార్‌ ఇలాంటి దుందుడుకు చర్యలకు దిగు తోందంటూ జన సైనికులు విరుచుకుపడుతున్నారు. తమ నాయకుడిపై కేసు పెట్టి, విచారించాలని ప్రభుత్వం నిర్ణ యించి వెంటనే జిల్లావ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ ఆందోళన రేకెత్తించింది. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఇటీవల ఉమ్మడి పశ్చిమలో సుదీర్ఘంగా చేసిన వారాహియాత్రలో ఆయనకు ప్రజాభిమానం దక్కింది. అన్ని బహిరంగ సభ ల్లోనూ జగన్‌నుద్దేశించి పవన్‌ ఏకవాక్యంతో పలుకుతూనే, సీఎం తప్పొప్పులను ఎత్తిచూపారు. ప్రభుత్వ వైఫల్యాలను తీవ్ర స్వరంతో ఎండగట్టారు. నరసాపురం, భీమవరం, ఏలూ రు, తాడేపల్లిగూడెం, తణుకు సభలన్నింటిలోనూ సీఎం జగన్‌పై తీవ్ర వాక్భాణాలు సంధించారు. తన వ్యక్తిగత వ్యవ హారాన్ని భూతద్దంలో చూపిస్తున్నారు కదా.. మీ భాగోతం బయట పెడతానంటూ జగన్‌కు పక్కా సవాల్‌ విసిరారు. వలంటీర్‌ వ్యవస్థ లోపాలను ఎత్తిచూపారు. స్థానిక అధి కారులు ఉండగా వలంటీర్లతో పనేంటంటూ నిలదీశారు. ఇలా ఒకటి.. రెండు కాదు.. ఆయన తన పర్యటనలో అనేక అంశాలను స్పృశించారు. తమ పార్టీ అభిమానులకు ధైర్యం వచ్చేలా, ఊపొచ్చేలా తన ప్రసంగ సరళిలో ప్రాంతానికి, ప్రాంతానికి మధ్య మార్పు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నా రు. తూర్పు నుంచి పశ్చిమగోదావరి వరకు వలంటీర్ల వ్యవస్థలోవున్న లొసుగులను ఎత్తిచూపుతూ వచ్చారు. ఏపీలో మహిళల అదృశ్యం వెనుక వలంటీర్ల వ్యవస్థ ఉందన్నట్టు కామెంట్లు చేయడం సంచలనానికి దారితీసింది. నియోజక వర్గస్థాయి సమావేశాల్లోనూ ఈ వ్యవస్థ పనితీరును ప్రశ్ని స్తూ వచ్చారు. ఇప్పుడు దానినే ప్రభుత్వం సీరియస్‌గా తీసు కుంది. తమని నిలదీసి ప్రశ్నిస్తున్న పవన్‌పై జిల్లాకు చెందిన మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు వంటి వారు విరుచుకుపడ్డారు. ఈ పరిణామాలన్నింటిలోనూ వలంటీరు వ్యవస్థ, పనితీరు, అభియోగాలు, మిగతా అంశాలన్నింటిపైనా రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వలంటీర్లు సైతం పవన్‌ దిష్టిబొమ్మలను పలు ప్రాంతాల్లో దహనం చేశారు. వీటిని పవన్‌ పట్టించుకోకుండా తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు ఉమ్మడి పశ్చిమలో పదేపదే స్పష్టం చేస్తూ వచ్చారు.

ఓర్వలేకే ప్రాసిక్యూట్‌

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తమ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌కు ప్రజల నుంచి వచ్చిన ఆదరాభిమానాలను చూసి ఓర్వలేక తమ ఓటమి ఖాయమని తెలిసి భరించలేక వైసీపీ రకరకాల ప్రయత్నాలకు దిగుతోందని, అందులో భాగమే తమ అధినేతపై ప్రాసిక్యూట్‌ చర్యలని జనసేన విరుచుకుపడడం ఆరంభించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్‌ పలు బహిరంగ సభల్లో పాల్గొని సీఎం జగన్‌ను నేరుగా నిలదీస్తే వైసీపీ తట్టుకోలేకపోయిందని దుయ్య బట్టారు. ఈ మేరకు నియోజకవర్గాల వారీగా పార్టీ కార్య కర్తలు, సీనియర్లు ఎక్కడికక్కడ భేటీ అయ్యారు. రాష్ట్ర కార్యాలయాన్ని సంప్రదించే ప్రయత్నం చేశారు. ఈ విష యంలో పార్టీ అధినేతకు మద్దతు ప్రకటించారు. నియోజక వర్గాల వారీగా బాధ్యులుగా వున్న వారంతా పార్టీలో వున్న మిగతా నేతలకు సమాచారం అందించారు. రాత్రి పొద్దు పోయేంత వరకు ఈ భేటీలు కొనసాగుతూనే ఉన్నాయి.

వైసీపీకి ఓటమి భయం

పవన్‌ కల్యాణ్‌ ఉమ్మడి పశ్చిమలో చేసిన పర్యటనతో వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. ఆయన నిలదీస్తుంటే బదులివ్వలేకపోయింది. చేసిన సవాళ్లను ఎదుర్కోలేకపోయింది. అందుకే ఇప్పుడు ఏదొక రూపంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని పవన్‌పై కేసులు మోపి ప్రాసిక్యూట్‌ చేయాలని జీవో జారీచేసింది. వలంటీర్లను రెచ్చగొట్టే ప్రయత్నాలకు దిగుతోంది. వైసీపీ దుశ్చర్యలను కచ్చితంగా అడ్డుకుంటాం.

– రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు నియోజకవర్గ కన్వీనర్‌

పవన్‌ కల్యాణ్‌ వాస్తవాలే చెప్పారు..

రాష్ట్రంలో మహిళల అదృశ్యం, వలంటీర్ల దారుణ వైఖరిపై మా పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పినవి వాస్తవాలే. పవన్‌ కల్యాణ్‌ మాటలకు ప్రజల మద్దతు ఉంది. అధికార పార్టీ చెందిన వారు కొందరు వ్యవహరి స్తున్న తీరు పట్ల ప్రజలు విసిగిపోతున్నారు. దానిని ప్రశ్నిస్తున్నందుకే ఇలా మా పార్టీ నేతపై అక్రమ కేసులకు పాల్పడుతున్నారు. దీనిని ఎదుర్కొంటాం. ప్రజలందరూ వైసీపీకి బుద్ధి చెప్పడం ఖాయం.

– చనమల్ల చంద్రశేఖర్‌, జనసేన

పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి

ఓడిపోతామన్న భయంతోనే..

ఎన్నికల ప్రయాణంలో నెగ్గుతామో, ఓడిపోతామో అంచనా వే సుకోలేక సీఎం జగన్‌ బరితెగింపు కేసులకు పాల్పడుతున్నారు. వలంటీర్లపై జనసేనాని పవన్‌ సున్నితంగా చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం వంటి కేసులు వేస్తూ పరోక్షంగా జనసేనానికి మరింత చరిష్మా తెచ్చి పెడుతున్నారు. వాస్తవ పరిస్థితులపైనే జగన్‌ స్పందిస్తే మెరుగ్గా ఉంటుంది. జగన్‌ దాష్టీకాలను జన సైనికులు చూస్తూ ఊరుకోరు.

– చేగొండి వెంకటహరరామజోగయ్య ,మాజీ ఎంపీ

Updated Date - 2023-07-21T00:38:45+05:30 IST