రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2023-04-02T00:38:15+05:30 IST
రెవెన్యూ రికార్డులు స్వచ్చీకరణ ప్రతీ గ్రామంలో నూటికి నూరుశాతం జరగాలని జాయింట్ కలెక్టర్ జెవి మురళి సంబంధిత అధికారులు ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం రెవెన్యూ స్వచ్ఛీకరణపై సబ్ కలెక్టర్, డీఆర్‌వో, ఆర్డీవో, సర్వే అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
భీమవరం, ఏప్రిల్ 1 : రెవెన్యూ రికార్డులు స్వచ్చీకరణ ప్రతీ గ్రామంలో నూటికి నూరుశాతం జరగాలని జాయింట్ కలెక్టర్ జెవి మురళి సంబంధిత అధికారులు ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం రెవెన్యూ స్వచ్ఛీకరణపై సబ్ కలెక్టర్, డీఆర్‌వో, ఆర్డీవో, సర్వే అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ క్షేత్రస్ధాయిలో రెవెన్యూ రికార్డులు స్వచ్ఛీకరణలో భాగంగా ప్రతీ గ్రామంలో ప్రతీ భూమి, ప్రతీ సర్వే నెంబర్ వద్ద సంబంధిత వీఆర్వో, గ్రామ సర్వేయర్ స్వయంగా వెళ్లి రెవెన్యూ రికార్డులు, దస్తావేజులు తనిఖీ చేయాలన్నారు. గ్రామంలో సర్వేయర్ వీఆర్వో గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వాల్యుడేషన్ ప్రక్రియ ఇంకా మెరుగు పరచాలన్నారు. కొన్నిచోట్ల మందకొడిగా జరుగుతుందని వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎక్కడ వివాదాలకు అవకాశం లేకుండా జరగాలని జేసీ సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి కె. కృష్ణవేణి, సబ్‌కలెక్టర్ సూర్యతేజ, డీఆర్‌వో దాసిరాజు, జిల్లా సర్వే అధికారి కె.జాషువా పాల్గొన్నారు.