చంద్రబాబు అరెస్టుపై జనసేన నిరసన
ABN , First Publish Date - 2023-09-23T00:11:53+05:30 IST
చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసి స్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నాయకులు, కార్యకర్తలు నగరంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఏలూరు కార్పొరేషన్, సెప్టెంబరు 22: చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసి స్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నాయకులు, కార్యకర్తలు నగరంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పాతబస్టాండ్ సెంటర్ వద్ద చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. జనసేన జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. వైసీపీ ప్రజాప్రతినిధులకు పోయేకాలం దగ్గరపడిందన్నారు. అరాచక పాలన సాగి స్తున్న సీఎం జగన్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా మాజీ ముఖ్యమంత్రిని అరెస్టుచేసి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సిరిపల్లి ప్రసాద్, ఇళ్ళా శ్రీనివాస్, ఒబిలిశెట్టి శ్రావణకుమార్ గుప్త, నగిరెడ్డి కాశీ నరేష్, వీరంకి పండు, పైడి లక్ష్మణరావు, కావూరి వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు.