ప్రజా సంక్షేమమే ధ్యేయం : బొలిశెట్టి

ABN , First Publish Date - 2023-09-04T00:02:28+05:30 IST

ప్రజా సంక్షేమమే జనసేన ధ్యేయమని జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బొలిశెట్టి శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో జనసేన రాక్స్‌ ప్రతినిధులతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించి మాట్లాడుతూ ఉద్యోగులు, ఉన్నత విద్యావంతులు పార్టీకి అండగా ఉండటమే జనసేన తొలి విజయమన్నారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయం : బొలిశెట్టి
మాట్లాడుతున్న బొలిశెట్టి శ్రీనివాస్‌

తాడేపల్లిగూడెం అర్బన్‌, సెప్టెంబరు 3: ప్రజా సంక్షేమమే జనసేన ధ్యేయమని జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బొలిశెట్టి శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో జనసేన రాక్స్‌ ప్రతినిధులతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించి మాట్లాడుతూ ఉద్యోగులు, ఉన్నత విద్యావంతులు పార్టీకి అండగా ఉండటమే జనసేన తొలి విజయమన్నారు. ఈ సందర్భంగా రాక్స్‌ ప్రతినిధులు మాట్లాడుతూ జనసేన విజయానికి కృషి చేస్తామన్నారు. జి. శివ, వీఎస్‌ఎస్‌ మూర్తి, వైవీ రాంబాబు, ఎ. సతీష్‌బాబు, జి.విశ్వనాధ్‌, పి. వెంకటేశ్వరరావు, పీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-04T00:02:28+05:30 IST