అటవీ భూముల్లో జలకళ బోర్లు

ABN , First Publish Date - 2023-03-31T00:37:18+05:30 IST

వైఎస్సార్‌ పథకం ముసునూరు మండలంలో జలకళ వివాదంలో ఇరుక్కుంది. అక్రమార్కులు ఈ పథకాన్ని పూర్తిగా పక్కదోవ పట్టించారనే ఆరోపణలు వినిపిస్తు న్నాయి.

అటవీ భూముల్లో జలకళ బోర్లు

అడ్డుకున్న గ్రామస్థులు.. ఫారెస్ట్‌ అధికారులకు ఫిర్యాదు

ముసునూరు, మార్చి 30: వైఎస్సార్‌ జలకళ పథకం ముసునూరు మండలంలో వివాదంలో ఇరుక్కుంది. అక్రమార్కులు ఈ పథకాన్ని పూర్తిగా పక్కదోవ పట్టించారనే ఆరోపణలు వినిపిస్తు న్నాయి. రమణక్కపేటలో ఏకంగా అటవీ భూముల్లోనే వైఎస్సార్‌ జలకళ ద్వారా బోర్లు వేస్తుండడంతో గ్రామస్థులు జలకళ వాహనాన్ని అడ్డుకుని సమాచారాన్ని ఏలూరు జిల్లా ఫారెస్ట్‌ అధికారులకు అందించడంతో గురువారం జిల్లా అటవీశాఖ అధికారి హరిగోపాల్‌ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని పరిశీలించారు. బుధవారం రాత్రి నాలుగు బోర్లు, గురువారం ఉదయం మరో బోరు వేశారు. ఇందులో మూడు బోర్లు అటవీ ప్రాదేశిక పరిధిలోనే ఉన్నాయని డీఆర్వో హరి గోపాల్‌ తెలిపారు. దీనిపై పూర్తిస్థాయి నివేదికను జిల్లా అధికారులకు అందివ్వనున్నట్టు పేర్కొ న్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు బోర్లను పూడ్చివేయాల్సిందిగా రెవెన్యూ అధికారులకు లిఖితపూర్వక సూచనలు చేయనున్నట్టు ఆయన తెలిపారు.

Updated Date - 2023-03-31T00:37:18+05:30 IST