నేటి నుంచి ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌

ABN , First Publish Date - 2023-03-20T00:14:09+05:30 IST

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల సంస్కృత సబ్జెక్టుకు స్పాట్‌ వాల్యుయేషన్‌ క్యాంప్‌ ఈ నెల 20వ తేదీ సోమవారం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ఏలూరులో ప్రారంభమ వుతుందని ఇంటర్మీడియట్‌ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి కే.చంద్రశేఖర్‌బాబు తెలిపారు.

నేటి నుంచి ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌

ఏలూరు టూటౌన్‌, మార్చి 19: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల సంస్కృత సబ్జెక్టుకు స్పాట్‌ వాల్యుయేషన్‌ క్యాంప్‌ ఈ నెల 20వ తేదీ సోమవారం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ఏలూరులో ప్రారంభమ వుతుందని ఇంటర్మీడియట్‌ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి కే.చంద్రశేఖర్‌బాబు తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో గల జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్ళు వారి కళాశాల లాగిన్‌లో అప్‌లోడ్‌ చేసిన సంస్కృత జూనియర్‌ లెక్చరర్‌లను రిలీవ్‌ చేయాలన్నారు. రిలీవ్‌ అయిన లెక్చరర్లను ఈ నెల 23 మధ్యాహ్నం 12 గంటల లోపు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఏలూరు కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.

Updated Date - 2023-03-20T00:14:09+05:30 IST