అక్రమ లేఅవుట్లను ప్రోత్సహిస్తే సస్పెండ్
ABN , First Publish Date - 2023-03-19T00:30:33+05:30 IST
జిల్లాలో అక్రమ లేఅవుట్లను ప్రోత్సహించినా, అనుమతులు ఇచ్చినా సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తామని ఇన్‌చార్జియ జాయింట్ కలెక్టర్ సూర్యతేజ హెచ్చరించారు.

స్పందనలో 220 ఫిర్యాదులు.. ఇన్‌చార్జి జేసీ సూర్యతేజ
భీమవరం, మార్చి 18 : జిల్లాలో అక్రమ లేఅవుట్లను ప్రోత్సహించినా, అనుమతులు ఇచ్చినా సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తామని ఇన్‌చార్జియ జాయింట్ కలెక్టర్ సూర్యతేజ హెచ్చరించారు. కలెక్టరేట్ నుంచి మునిసిపల్ కమిషనర్లు, ఈపీవోఆర్డీలు, టౌన్ ప్లానింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, తదితర సిబ్బందితో శనివా రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో అక్రమ లేఅవుట్లపై 220 ఫిర్యాదులు స్పందన కార్యక్రమంలో అందాయని, వీటిని పరిశీలించి అక్రమాలు రుజువైతే సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమంగా మట్టి తవ్వకాలు, రవాణాపై నిఘా పెట్టాలన్నారు.
అనధికార లేఅవుట్ ధ్వంసం
నరసాపురం, మార్చి 18 : పట్టణంలోని అనధికార లే అవుట్లపై మునిసిపాలిటీ మరోసారి కొరడా ఝళిపించింది. కమిషనర్ శ్రీనివాస్ ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ అధికారులు 15 వార్డులో అనధికారికంగా వేసిన లే అవుట్‌ను శనివారం ధ్వంసం చేశారు. మిగిలిన అనధికార లే అవుట్లను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతి లేని లేఅవుట్‌ల్లో స్థలాలు కొనుగోలు చేస్తే ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వమని కమిషనర్ చెప్పారు.