పారిశుధ్యం మెరుగుపర్చండి
ABN , First Publish Date - 2023-05-26T00:12:35+05:30 IST
పట్టణలోని రైతుబజారు, డీఏఆర్ కళాశాల రహదారి ప్రాంతాలను నూజివీడు సబ్‌కలెక్టర్ ఆదర్ష్‌రాజీంద్రన్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు.

నూజివీడు టౌన్, మే 25: పట్టణలోని రైతుబజారు, డీఏఆర్ కళాశాల రహదారి ప్రాంతాలను నూజివీడు సబ్‌కలెక్టర్ ఆదర్ష్‌రాజీంద్రన్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. పారిశుధ్య పరిస్థితిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం పారిశుధ్య మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారులను ఆక్రమిస్తే చర్యలు తప్పవని దుకాణదారులను హెచ్చరించారు. స్వచ్ఛపట్టణం కోసం అందరం నడుం బిగించాలని సూచించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, కమిషనర్ సయ్యద్ అబ్దుల్‌రషీద్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.