ఐజేయూ కార్యదర్శిగా సోమసుందర్
ABN , First Publish Date - 2023-03-19T23:59:07+05:30 IST
ఇండి యన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) జాతీయ కార్యదర్శిగా దూసనపూడి సోమసుందర్ ఎన్నిక య్యారు.

తాడేపల్లిగూడెం రూరల్, మార్చి 19: ఇండి యన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) జాతీయ కార్యదర్శిగా దూసనపూడి సోమసుందర్ ఎన్నిక య్యారు. చండీఘర్‌లో శని, ఆదివారల్లో నిర్వహిం చిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007 నుంచి 2015 వరకూ ఆయన ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరించారు. అనంతరం ఐజేయూ సభ్యునిగా కొనసాగుతున్నారు. జిల్లా కన్వీనర్ గజపతి వరప్రసాద్, తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు చిక్కాల రామకృష్ణ, ఎం.రవికిరణ్‌లు సోమసుందర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.