విద్యార్థులు ఇష్టంతో చదివితే ఉన్నత స్థానం

ABN , First Publish Date - 2023-03-31T00:02:37+05:30 IST

విద్యార్ధులు భారంగా కాకుండా ఇష్టంతో చదివితే ఉన్నత స్థానం చేరుకోవచ్చని ఎంపీపీ తాతా రమ్య అన్నారు.

విద్యార్థులు ఇష్టంతో చదివితే ఉన్నత స్థానం
పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొన్న ఎంపీపీ, అధికారులు

పెదవేగి, మార్చి 30: విద్యార్ధులు భారంగా కాకుండా ఇష్టంతో చదివితే ఉన్నత స్థానం చేరుకోవచ్చని ఎంపీపీ తాతా రమ్య అన్నారు. గార్లమడుగులోని ప్రభుత్వ ఓరియంటల్‌ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ రమ్య మాట్లాడుతూ విద్యార్ధులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదన్నారు. ఉపాధ్యా యులతోపాటు తల్లిదండ్రులు కూడా శ్రద్ధవహిస్తే విద్యార్థులు ఉన్నతంగా రాణిస్తారని ఆమె చెప్పారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగయ్యాయని, ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి మెరుగైన విద్యనందుకోవాలని ఆమె సూచిం చారు. ఈ సందర్భంగా విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంపీడీవో జి.రాజ్‌మనోజ్‌, ఎంఈవో సీహెచ్‌. బుధవాసు, గ్రామ సర్పంచ్‌ జిజ్జువరపు నాగరాజు, స్థలదాత మేడికొండ రాజ్యలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T00:02:37+05:30 IST