ఈదురు గాలులు.. వడగళ్లు.. వర్షం

ABN , First Publish Date - 2023-05-26T23:38:54+05:30 IST

భీమడోలు మండలంలో శుక్రవారం రాత్రి ఈదురు గాలులు భీభత్సం సృష్టించాయి.

ఈదురు గాలులు.. వడగళ్లు.. వర్షం
భీమడోలులో ఈదురు గాలులకు నేలకు ఒరిగిన విద్యుత్‌ స్తంభం

భీమడోలు, మే 26: భీమడోలు మండలంలో శుక్రవారం రాత్రి ఈదురు గాలులు భీభత్సం సృష్టించాయి. భీమడోలు, కురేళ్ళగూడెం, పూళ్ళ తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున ఈదురుగాలులు వీచాయి. మండల వ్యాప్తంగా సుమారు 35 విద్యుత్‌ స్దంభాలు నేలకొరిగాయి. పలు గ్రామాల్లో చెట్లు నేల కూలడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్‌ స్తంభాలు కూలి పోవడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కురెళ్ళగూడెం తదితర గ్రామాల్లో వడగండ్లు కురియడంతో రేకుషెడ్లు, ఇళ్లు దెబ్బతిన్నాయి. విద్యుత్‌శాఖ అధికారులు స్థంబాలు సరిచేసి సరఫరా పునరుద్ధరించారు. రణలో భాగంగా స్ధంభాలను పునరుద్దరించినట్లు తెలిపారు.

పోలవరంలో భారీ వర్షం

పోలవరం, మే 26: మండలంలో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో, ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఠారెత్తించింది. ఎండ తీవ్రతకు రోడ్లు వీదులు నిర్మానుష్యంగా మారాయి. సాయంత్రానికి వాతావరణం మారి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. కురిసిన వర్షానికి పోలవరం మెయిన్‌ బజార్‌, బెస్తావీధి, జలమయమాయ్యాయి. రైతులు కల్లాలలో మొక్కజొన్న పంటలపై బరకాలు కప్పి ఒబ్బిడి చేసుకున్నారు.

Updated Date - 2023-05-26T23:38:54+05:30 IST