సమాజ సంస్కరణకు సాహితీ ఆయుధం జాషువా
ABN , First Publish Date - 2023-09-28T23:55:40+05:30 IST
సమాజ సంస్కరణకు సాహిత్యాన్ని ఆయుధంగా ఎంచుకుని అసమానతలపై గళమెత్తిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా అని పలువురు వక్తలు కొనియాడారు.
జయంతి సభలో పలువురి నివాళి
కామవరపుకోట, సెప్టెంబరు 28: సమాజ సంస్కరణకు సాహిత్యాన్ని ఆయుధంగా ఎంచుకుని అసమానతలపై గళమెత్తిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా అని పలువురు వక్తలు కొనియాడారు. స్థానిక ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో గురువారం తెలుగు విభాగం ఆధ్వర్యంలో గుర్రం జాషువా జయంతి గురువారం నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఎం.మల్లేశ్వరరావు జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అధ్యాపకులు జి.శ్రీనివాసరావు, జి.రామ్మోహన్, వి.శ్రీనివాస్, ఎం.ఉషారాణి, కె.ఇందిరాకుమారి, దారావతు మల్లేష్, ఎ.హర్షవర్ధిని, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఏలూరు టూటౌన్: షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యాలయంలో గుర్రం జాషువా జయంతి నిర్వహించారు. ఆయన చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అఖిల భారత అంబేడ్కర్ యు వజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మెండెం సంతోష్‌కుమార్ మాట్లాడు తూ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా జాషువా పోరాడారన్నారు. తన సాహిత్యంతో సమాజంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారన్నారు. జాషువా బాటలో పయనిం చాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ వార్డెన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గురుబాబు, కే.రవిప్రసాద్, శ్రీను, మురళీకృష్ణ, పాల్గొన్నారు.
నవయుగ కవిచక్రవర్తి, కవికోకిల గుర్రం జాషువ జయంతి ఏలూరు జిల్లా గ్రంథాలయంలో బహుజన్ టీచర్స్ అసోసియేషన్, ఎస్సీ, ఎస్టీ బహుజన రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. జాషువా సేవలను కొనియా డారు. తెలుగు టీచర్ నీలిమ సోని జాషువా కవితలు వినిపించారు.
భగత్‌సింగ్, గుర్రం జాషువా జయంతి
టి.నరసాపురం: స్థానిక యూపీ స్కూల్‌లో భగత్ సింగ్, గుర్రం జాషువా జయంతి వేడుకలు అరసం, హెచ్‌ఎం పురం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వారి చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళు లర్పించారు. అరసం రాష్ట్ర కార్యదర్శి బిఎన్ సాగర్ మాట్లాడుతూ ఒకపక్క కార్పొరేట్ శక్తులు, మరోపక్క మతోన్మాద ఫాసిస్టు మూకల నుంచి దేశాన్ని రక్షించడానికి భగత్‌సింగ్ త్యాగం, పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కలాన్ని ఆయుధంగా మలచుకొని కుల వివక్షపై కవితా స్త్రాలను సంధించిన మహావ్యక్తి గుర్రం జాషువా అన్నారు. జి.విజయలక్ష్మి, కె.మహాలక్ష్మి, టి.అరుణ, జి.వరలక్ష్మి, కె.ఎస్తేరురాణి, బి.పుష్పావతి, కె.రాజేశ్వరి, జి.రమ్యశ్రీ, వి.మౌనిక తదితరులు పాల్గొన్నారు.
చింతలపూడి: సీపీఐ కార్యాలయంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. భగత్‌సింగ్ చిత్రపటానికి జిల్లా కోకన్వీనర్ టి.రాజు పూలమాల వేశారు. భగత్‌సింగ్ స్ఫూర్తితో అంతరాలు, అసమానతలు లేని సమాజం రావాలని, నూతన ప్రత్యామ్నాయ రాజకీయ విలువల కోసం నిలబడాలన్నారు. ఏఐవైఎఫ్ నాయకులు కంచర్ల గురవయ్య, టి.బాబు, జి.వెంకటేశ్వరరావు, విజయశేఖర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
జీలుగుమిల్లి: భగత్‌సింగ్ ఆశయాల్ని నేటి తరం ఆదర్శంగా తీసుకోవా లని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు. జీలుగుమిల్లిలో భగత్‌సింగ్ జయంతి నిర్వహించారు. ఐద్వా మండల కార్యదర్శి ఎన్.నిర్మల భగత్‌సింగ్ కాలనీ వాసు లు ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 23 ఏళ్ల వయసులో దేశం కోసం ఉరితాడును ముద్దాడిన మహోన్నత వ్యక్తి భగత్‌సింగ్ యువతకు స్ఫూర్తి అన్నారు. నాయకులు ఎన్.అప్పారావు, అక్బర్, సీత, మణి, సూర్యకుమారి, రామకృష్ణ ఉన్నారు.