ఏసీబీ వలలో గ్రామ కార్యదర్శి

ABN , First Publish Date - 2023-06-01T00:03:50+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం సగంచెరువు గ్రామ కార్యదర్శి సిహెచ్‌. ఆర్‌.వి.ఆర్‌.ఎస్‌. పార్ధసారఽథి నాలుగు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు బుధవారం పట్టు బడ్డాడు.

ఏసీబీ వలలో గ్రామ కార్యదర్శి

పాలకొల్లు రూరల్‌, మే 31 : పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం సగంచెరువు గ్రామ కార్యదర్శి సిహెచ్‌. ఆర్‌.వి.ఆర్‌.ఎస్‌. పార్ధసారఽథి నాలుగు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు బుధవారం పట్టు బడ్డాడు. వివరాల్లోకి వెళితే.. 2021లో పంచదార వెంకట రంగారావు అనే గుత్తే దారు పాలమూరులో శ్మశానవాటిన అభివృద్ధి పనులు చేశాడు. రెండేళ్లుగా బిల్లులు చెల్లించకపోవ డంతో అప్పటి పాలమూరు పంచాయతీ ఇన్‌చార్జి కార్యదర్శిగా పనిచేసిన పార్ధసారఽథి బిల్లు చెల్లించడానికి రూ. 15వేలు డిమాండ్‌ చేశాడు. తొలి విడతగా రూ.4వేలు ఇచ్చేందుకు అంగీకరించిన వెంకటరంగారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ పి.శరత్‌ బాబు ఆధ్వర్యంలో సీఐలు కె.ఏసు బాబు, ఎ.వి. భాస్కరరావు, బి. శ్రీనివాస్‌, కె.నాగేంద్ర ప్రసాద్‌ సిబ్బందితో కలిసి ప్రస్తుతం సగంచెరువు గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్న పార్ధసారఽథికి వెంకట రంగారావు రూ.4వేలు ఇస్తుండగా వలపన్ని పట్టుకున్నారు. నిందితుడు పార్ధ సారఽథిని ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్టు డీఎస్పీ తెలిపారు.

Updated Date - 2023-06-01T00:03:50+05:30 IST