గౌతు లచ్చన్న మార్గం అనుసరణీయం
ABN , First Publish Date - 2023-04-19T23:01:07+05:30 IST
స్వాతంత్య్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి సభ బీసీ సంక్షే మ సంఘం ఆధ్వర్యంలో మల్లవరపు సత్యనారాయణ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు.
జంగారెడ్డిగూడెం టౌన్, ఏప్రిల్ 18: స్వాతంత్య్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి సభ బీసీ సంక్షే మ సంఘం ఆధ్వర్యంలో మల్లవరపు సత్యనారాయణ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్ర శేషు మాట్లాడుతూ గౌతు లచ్చన్న మార్గం అందరికీ అనుసరణీయం అన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా, బలహీన వర్గాలు, రైతు, కార్మిక నాయకుడిగా అనేక ఉద్యమాలను సాగించారన్నారు. బీసీ నాయకుడు తూటికుంట దుర్గా రావు మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతాలకై పోరాడి నిలిచిన మహా నాయకు డు లచ్చన్న అన్నారు. చిట్రోజు తాతాజీ, రాజాన పండు, చిట్టిబోయిన రామ లింగేశ్వరరావు, చిటికెల అచ్యుతరామయ్య, లోకారు వెంకటేశ్వరరావు, ఎల్‌ఆర్ కృష్ణ, తూటికుంట రాము, తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు ఎడ్యుకేషన్: ఏలూరులో గౌతు లచ్చన్న విగ్రహానికి గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం, బీసీ కులాల జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో పూలమాలలువేసి నివాళులర్పించారు. సంఘ అద్యక్షుడు రవిశంకర్ మాట్లా డుతూ గీతకులాల ఐక్యతకు గౌతు లచ్చన్న చేసిన కృషిని, స్వాతంత్రో ద్యమంలో జరిపిన పోరాటాలను గుర్తు చేశారు. బీసీల రిజర్వేషన్లకు కృషి చేసిన మహోన్నతవ్యక్తి లచ్చన్న అన్నారు. సంఘ నాయకులు శివశంకర్, వెంకటసుబ్బారావు, నాగేంద్ర, రాంబాబు, లక్షణస్వామి పాల్గొన్నారు.
కామవరపుకోట: స్థానిక రామభద్ర గౌడ యువత ఆధ్వర్యంలో గౌతు లచ్చన్న వర్ధంతి నిర్వహించారు. యువకులు గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. లచ్చన్న స్ఫూర్తితో యువత ముందుకు వెళ్ళాలంటూ ప్రతిజ్ఞ చేశారు. మోహన్, పలివెల ప్రభాకర్, పర్సా శ్రీనివాసరావు, వీరమళ్ళ మధు, గుల్లా రామకృష్ణ, రవికుమార్, రమేష్, మట్టా పవన్, శీలబోయిన విజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.