తూతూమంత్రంగా

ABN , First Publish Date - 2023-05-26T00:12:34+05:30 IST

పోలవరం గ్రామానికి రక్షణగా ఏర్పా టు చేసిన నక్లెస్‌ బండ్‌ పనులను అధికారులు తూతూ మంత్రంగా చేయడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు.

తూతూమంత్రంగా
రాయితో నక్లెస్‌ బండ్‌ పనులు

పోలవరం నక్లెస్‌ బండ్‌ పనుల తీరిది

ర్యాంపులు, స్లూయిజ్‌ల ఊసేలేదు

ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు

పోలవరం, మే 25 : పోలవరం గ్రామానికి రక్షణగా ఏర్పా టు చేసిన నక్లెస్‌ బండ్‌ పనులను అధికారులు తూతూ మంత్రంగా చేయడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. బండ్‌ పటిష్టతపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచు రితమైన వరుస కథనాలకు స్పందించిన అధికారులు రూ.5 కోట్లతో నక్లెస్‌ బండ్‌కు రక్షణ చర్యలు చేస్తున్నామని ప్రకటిం చినా క్షేత్రస్థాయిలో పనులు ఆ మేరకు జరగడం లేదు.

గతంలో రూ.1.5 కోట్లతో ఆరు వందల మీటర్ల మేర పోల వరం ప్రాజెక్టు నుంచి రాయిని తరలించి నెక్లెస్‌బండ్‌కి అను సంధానంగా రక్షణ చేపట్టారు. ప్రస్తుతం రూ.5 కోట్ల నిధులతో కేవలం 850 మీటర్ల మేర మాత్రమే పనులు జరుగుతాయని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. 2006లో అఖండ గోదావరి రివర్‌ బండ్‌ అధికారులు రూ.12 కోట్ల నిధుల అంచనాలతో రెండు చోట్ల స్లూయిజ్‌లు, అవసర మైన ప్రాంతాల్లో ర్యాంపులు ఏర్పాటు చేసేందుకు నివేది కలు పంపినా నిధులు మంజూరు కాలేదని వదిలేశారు. తొలుత రూ.6 కోట్లతో పనులు చేయడా నికి సంకల్పించిన అధికారులు భూసేకరణకు రూ.1.50 కోట్లు ఖర్చు చేశారు. 2009లో గ్రామానికి రక్షణగా 3.5 కిలోమీటర్ల నక్లెస్‌బండ్‌ నిర్మించాల్సి ఉండగా కేవలం ప్రాజెక్టు మట్టి తరలించి సరి పెట్టారు. ఆ బంకమన్ను గట్టు గత నాలుగేళ్లుగా వచ్చిన వరదలకు కొట్టుకుపోయి ప్రజానీకం వరదల సమయాల్లో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నారు. అధికారులు వరదల సమయాల్లో ఇసుక బస్తాలతో తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్నారే గానీ శాశ్వత పరిష్కారం చూపలేక పోయారు. ‘ఆంధ్రజ్యోతి’ కథనాలతో పనులు ప్రారంభించినా రాళ్ళతో 3.5 కిలోమీటర్ల మేర పనులు చేయకుండా తాజాగా చేస్తున్న 850 మీటర్ల మేర రక్షణ పనులు, గతంలో చేసిన 600 మీటర్ల రక్షణ పనులు కలిపి 1450 మీటర్ల మేర మాత్రమే పనులు చేస్తున్నారు. మరో 1050 మీటర్ల మేర రక్షణ పనులు చేయడం లేదు. రక్షణ పనులు చేపట్టని ప్రాంతంలో వరద ఉధృతికి మళ్లీ కోతకు గురయితే పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధి కారులు ప్రాజెక్టు నుంచి ఉచితంగా తరలించే రాళ్లకే ఇప్పటి వరకు రూ.6.50 కోట్టు ఖర్చు పెట్టారా.. అనే సందే హాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. రాళ్ళతో మాత్రమే నెక్లెస్‌బండ్‌ నిర్మాణం చేస్తే రాళ్ల సందుల్లో నుంచి వరద జలాలు ప్రవహించి మట్టి కట్ట కొట్టుకుపోయి గండిపడే ప్రమాదం ఉందని, కాంక్రీట్‌ నిర్మాణం లేదా సిమెంట్‌ తో పటిష్టంగా పనులు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

నెక్లెస్‌బండ్‌ నిర్మాణంలో ర్యాంపులు, స్లూయిజ్‌లు ఏర్పాటు చేయకపోవడం వల్ల గోదావరికి పుణ్యస్నానాలు, మంచినీటి కోసం వెళ్లడానికి ఇబ్బందులకు గురవుతున్నా మని, 70 రజక కుటుంబాలు కులవృత్తి చేసుకోవ డానికి వీలుకాక కులవృత్తిని మానుకుని కూలిపనులకు, ఇతర గ్రామాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని రజకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా మృతి చెందితే దహన, ఖనన కార్యక్రమా లకు, పిండ ప్రదానా లకు నదీ తీరానికి వెళ్లడానికి వీలుకాక రాజమహేంద్ర వరం, కొవ్వూరు శ్మశానాలకు మృతదేహాలను తరలించా ల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని మృతుల కుటుం బాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెక్లెస్‌ బండ్‌ నిర్మాణం లో శ్మశానం కూడా నిర్మించాలని కోరుతున్నారు. జాలర్లు వేటకు వెళ్లడానికి ర్యాంపులు లేక రాళ్ళలో నడవ లేక ప్రమాదాలకు గురవుతున్నామని తమ గోడు వెళ్లబోసు కుంటున్నారు. స్లూయిజ్‌ల నిర్మాణం ఊసు కూడా లేకపోవ డంతో వరదలు, వర్షాల సమయాల్లో వర్షం నీరు, గ్రామంలో వాడకం నీరు బయటకు పోయే మార్గంలేక పల్లపు ప్రాంతాలు జలమయమవుతున్నాయని, అనారోగ్యా లతో, దోమలతో అవస్థలు పడుతున్నా మని స్లూయిజ్‌ నిర్మాణం చేయాలని ప్రజానీకం కోరుతున్నారు.

ర్యాంపులు లేక ఉపాఽధి పోయింది..

నక్లెస్‌బండ్‌ నిర్మాణంలో ర్యాంపులు లేక ఉపాఽధి లేకుండా పోయింది. ర్యాంపు ల నిర్మాణం చేయాలి. ఇప్పటికే ఉపాధి లేక రజకులు కులవృత్తి చేసుకోవడానికి వలసలు పోవాల్సి వచ్చింది. రాళ్ళలో ఇబ్బందులకు గురవుతూ 40 అడుగుల దిగువకు గోదావరికి వెళ్లాల్సి వస్తోంది.

– శంకారపు చిన్నారెడ్డి, రజకుడు

పూర్తిస్థాయిలో పనులు చేయాలి

శ్మశానం లేక నదీ తీరానికి వెళ్లే దారిలేక మృతుల కుటుంబాలు దహన, ఖనన కార్యక్రమాలకు, పిండ ప్రదానా లకు ఇతర పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థి తులు ఏర్పడ్డాయి. శ్మశానం నిర్మించాలి. కార్తీకమాస పుణ్య స్నానాలు, మంచినీటి అవసరాలకు, మత్స్యకారులకు, రజకులకు ఉపయోగపడేలా అవసరమైన చోట్ల ర్యాంపులు ఏర్పాటు చేయాలి. గ్రామంలో వర్షాల నీరు, మురుగునీరు పోయేలా నెక్లెస్‌ బండ్‌ వెంబడి మేజర్‌ డ్రెయి నేజీ స్లూయిజ్‌ల నిర్మాణం చేయాలి. శాశ్వత ప్రాతిపదికన పోలవరం గ్రామానికి రక్షణ కల్పించాలి.

– మంగిన కొండ మాజీ ఉప సర్పంచ్‌

Updated Date - 2023-05-26T00:12:34+05:30 IST