గంజాయి ముఠా గుట్టురట్టు

ABN , First Publish Date - 2023-03-19T00:13:43+05:30 IST

నరసాపురం, మార్చి 18: తీరంలో గంజాయి ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

గంజాయి ముఠా గుట్టురట్టు
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రవిప్రకాష్‌

నరసాపురం, మార్చి 18: తీరంలో గంజాయి ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి నుంచి 23 కేజీలు స్వాధీనం చేసుకున్నారు. రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో శని వారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ రవిప్రకాష్‌ మాట్లాడుతూ, పక్కా సమాచారంతో పట్ట ణంలోని థామస్‌ వంతెన వద్ద నిఘా పెట్టి నలుగురిని అరెస్టు చేసినట్టు చెప్పారు. వీరి నుంచి రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగా మరో నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి 21 కేజీలు స్వాధీనం చేసుకుని రెండు సెల్‌పోన్లను సీజ్‌ చేశామన్నారు. నరసాపురంలో పట్టు బడిన వారిలో ఏలూరి శ్యాంసన్‌, బెరవ వెంకటేష్‌, గోళ్ళ విక్రాంత్‌సాగర్‌, ఒక బాల నేరస్థుడు ఉన్నార న్నారు. మొగల్తూరు శేరేపాలెం రోడ్డులో సవరపు బుజ్జీ, సంగాని క్రాంతిరాజు, లోటి సాయిబాలాజీతో పాటు మరో బాల నేరస్థుఢు పట్టుబడ్డారన్నారు. మరో ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉందని ఎస్పీ చెప్పారు. పట్టుబడిన ఎనిమిది మందిలో నరసాపురం కేసులో మొదటి నిందితుడిగా ఉన్న శ్యాంసన్‌ గతంలో అనేక సార్లు గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారన్నారు. అతడిపై పీడీ యాక్టు నమోదు చేస్తున్నామ న్నారు. జిల్లాలో గంజాయిని నియంత్రించేందుకు పోలీస్‌ శాఖ గట్టి నిఘా ఉంచిందని ఎస్పీ చెప్పారు. గంజాయి సరఫరా చేసే వ్యక్తులపై దాడులు చేస్తున్నా మన్నారు. గంజాయికి బానిసైన వారికి కౌన్సిలింగ్‌ ఇస్తున్నామ న్నారు. డీఎస్పీ మనోహరచారీ, సీఐలు సురేష్‌బాబు, శ్రీనివాసయాదవ్‌, ఎస్సై వీరబాబు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2023-03-19T00:13:43+05:30 IST