రూ.20.78 కోట్లతో తూడు నిర్మూలన

ABN , First Publish Date - 2023-06-03T00:31:03+05:30 IST

జిల్లాకు మంజూరైన నీటి పారుదల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.

రూ.20.78 కోట్లతో తూడు నిర్మూలన
పెదఅమిరంలో సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రశాంతి

యుద్ధ ప్రాతిపదికన నీటిపారుదల పనులు చేపట్టాలి : కలెక్టర్‌ ప్రశాంతి

భీమవరం, జూన్‌ 2 : జిల్లాకు మంజూరైన నీటి పారుదల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్‌ లో శుక్రవారం కలెక్టర్‌ నీటి పారుదల పనులపై సమీక్షించారు. కాల్వలు, డ్రెయి న్లలో తూడు నిర్మూలన పనులను షెడ్యూల్‌ ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలన్నారు. యలమంచిలి, నరసాపురం ప్రాంతాలలో బ్యాక్‌ వాటర్‌ కారణంగా సుమారు 3,500 ఎకరాల్లో ఒక పంట వేయలేకపోతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, బ్యాక్‌వాటర్‌ ఇబ్బందిని తొలగించేందుకు అవసరమైన పనులకు ప్రతిపాదలను వెంటనే సమర్పించాలన్నారు. మాధవాయపాలెం,దర్భరేవు షట్టర్ల మరమ్మ తులు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నరసాపురం ప్రధాన కాలువ వెంబడి ఆక్రమణలు, టాయిలెట్లు తొలగింపు పనులను పూర్తిచేసి ఓఎన్‌ జీసీ యాజమాన్యానికి బ్యూటిఫికేషన్‌ పనుల నిమిత్తం అప్పగించాలని సూచించారు. మోగల్లు, పాలకోడేరు శివారు ప్రాంతాల నీటి సమస్య పరిష్కారానికి పూర్తిస్థాయి చర్యలు చేపట్టాలన్నారు. నరసాపురంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన ఆరు పనులకు, యండగండి షట్లర్ల మరమ్మతులకు సంబంధించి ప్రతిపాదనలతో లేఖ రాయాలని సూచించారు.సమావేశంలో జిల్లా నీటి వనరుల అధికారి నాగార్జునరావు, కాల్వల ఈఈ దక్షిణామూర్తి, డీఈలు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:31:18+05:30 IST