ఈపీఎఫ్‌ సేవలు సద్వినియోగం చేసుకోండి

ABN , First Publish Date - 2023-02-27T23:48:31+05:30 IST

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ సహాయ కమిషనర్‌ యామజాల దుర్గా శ్రీనివాస్‌ కోరారు.

ఈపీఎఫ్‌ సేవలు సద్వినియోగం చేసుకోండి
అవగాహన కల్పిస్తున్న సహాయ కమిషనర్‌ వైడీ శ్రీనివాస్‌

భీమవరం టౌన్‌, ఫిబ్రవరి 27 : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ సహాయ కమిషనర్‌ యామజాల దుర్గా శ్రీనివాస్‌ కోరారు. స్థానిక విష్ణు కాలేజీ మినీ ఆడిటోరియంలో సోమవారం ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాదారులతో ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ఖాతాదారులు లావాదేవీలపై ఎదుర్కొంటున్న ఇబ్బందులను సులువుగా పరిష్కరించుకునేందుకే అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామ న్నారు. పలువురు తమకు భవిష్యనిధి సమాచారం అందటంలేదని, తాము ఎంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌ సక్రమంగా పని చేయడం లేదని సహకరించాలని కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ సహకారం అందించటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ఈఎస్‌ఐసి దినోత్సవం సందర్భంగా మార్చి 10 వరకు పక్షోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ మేనేజర్‌ కె. శ్రీనివాస్‌ తెలిపారు. జిల్లా ఖజానా అధికారి అడారి గణేష్‌, ఈపీఎఫ్‌ సంస్థ నోడల్‌ అధికారి పి. శివరామకృష్ణ, తహసిల్దార్‌ వై.రవికుమార్‌, ఖాతాదారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-27T23:48:37+05:30 IST