ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2023-06-03T00:30:50+05:30 IST

ఉద్యో గుల సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్‌ కార్యా లయం వద్ద భీమడోలు తాలూకా యూ నిట్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వ ర్యంలో శుక్రవా రం రిలే నిరాహార దీక్ష చేపట్టారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యోగ సంఘ నాయకులు

భీమడోలు, జూన్‌ 2: ఉద్యో గుల సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్‌ కార్యా లయం వద్ద భీమడోలు తాలూకా యూ నిట్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వ ర్యంలో శుక్రవా రం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వీఆర్వోల సంఘం, ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం, ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగుల సంఘం కాంట్రాక్టు సంఘాల నాయకులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఏపీజీఈఏ జిల్లా కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ గతి లేని పరిస్థితిలో ఉద్యోగులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని, అన్ని సంఘాల నాయకులతో అర్ధవంతమైన చర్చలు జరిపి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. జీతాల చెల్లింపులు, ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులపై చట్టం చేయాలని, సీపీఎస్‌ రద్దు పరిచి పాత పెన్షన్‌ విధానాన్ని వెంటనే అమలు చేయాలని, కాంట్రా క్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌, ఎన్‌ఎంఆర్‌ కంటింజెంట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌, ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లా యీస్‌ యూనియన్‌ ప్రభాకర్‌, ధర్మాంజనేయ ప్రసాద్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు, కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:30:50+05:30 IST