రెండుగా ఏలూరు మండలం విభజన

ABN , First Publish Date - 2023-03-30T00:58:29+05:30 IST

ఏలూరు జిల్లాలో మరో మండలం ఏర్పాటైంది. అర్బన్‌ మండలాల ఏర్పాటులో భాగంగా ఏలూరు జిల్లాలోని ఏలూరు మండలాన్ని రెండు మండలాలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ బుధవారం జారీ చేసింది.

రెండుగా ఏలూరు మండలం విభజన

ఏలూరు సిటీ, మార్చి 29: ఏలూరు జిల్లాలో మరో మండలం ఏర్పాటైంది. అర్బన్‌ మండలాల ఏర్పాటులో భాగంగా ఏలూరు జిల్లాలోని ఏలూరు మండలాన్ని రెండు మండలాలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ బుధవారం జారీ చేసింది. ఈ విభజన విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు/ సూచనలు ఇవ్వ దలచుకుంటే నెలరోజులు లోగా జిల్లా కలెక్టర్‌కు తెలియజేయాల్సి ఉంటుందని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటైన ఏలూరు అర్బన్‌ మండలంలో చొదిమెళ్ళ, తంగెళ్ళమూడి, శని వారపుపేట, సత్రంపాడు, వెంకటాపురం, కొమడవోలు, పోణంగి మొత్తం 7 పంచాయతీలు, ఏలూరు రూరల్‌ మండలంలో చాట పర్రు, జాలిపూడి, కాట్లంపూడి, మాదేపల్లి, మల్కాపురం, మానూరు, శ్రీపర్రు, కలకుర్రు, కోమటిలంక, గుడివాకలంక, కొక్కిరాయిలంక, పైడిచింతపాడు, ప్రత్తికోళ్లలంక మొత్తం 13 గ్రామాలు ఉంటాయి. ఇటీవల కేబినెట్‌ సమావేశంలో అర్బన్‌ మండలాల ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోంది.

–––––––––––––––––––––––––––––

Updated Date - 2023-03-30T00:58:29+05:30 IST