ఏలూరు డీఎస్పీగా శ్రీనివాసులు బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2023-05-15T00:16:50+05:30 IST

శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పిం చేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటానని ఏలూరు డీఎస్పీ ఇ.శ్రీనివాసులు అన్నారు.

ఏలూరు డీఎస్పీగా శ్రీనివాసులు బాధ్యతల స్వీకరణ
నూతన డీఎస్పీ శ్రీనివాసులకు పుష్పగుచ్ఛం అందిస్తున్న ఇన్‌చార్జి డీఎస్పీ పైడేశ్వరరావు

ఏలూరు క్రైం, మే 14 : శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పిం చేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటానని ఏలూరు డీఎస్పీ ఇ.శ్రీనివాసులు అన్నారు. ఇటీవల జరిగిన డీఎస్పీల బదిలీల్లో ఏలూరు సీసీఎ్‌స్‌ డీఎస్పీగా నియమితులైన ఆయన ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇన్‌చార్జి డీఎస్పీగా అదనపు బాధ్యతలు నిర్వహించిన సీసీఎస్‌ డీఎస్పీ జీవీఎస్‌ పైడేశ్వరరావు డీఎస్పీ కార్యాలయం వద్ద నూతన డీఎస్పీ శ్రీనివాసులకు పుష్పగుచ్ఛం అందించి బాధ్యతలు అప్పగించారు. 91 బ్యాచ్‌కు చెందిన శ్రీనివాసులు పలు జిల్లాల్లో డీఎస్పీగా పనిచేసి పులివెందులలో పని చేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ ప్రజా స్వేచ్ఛకు ఎవరు భంగం కలిగించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. క్రికెట్‌ బెట్టింగులు, జూదం జరగకుండా కట్టుదిట్టం చేస్తామన్నారు. రాత్రి బీట్‌లు పటిష్టంగా అమలు చేస్తామన్నారు. రౌడీషీటర్లకు క్రమం తప్పకుండా కౌన్సెలింగ్‌లు, వైట్‌ కాలర్‌ నేరాలు, సైబర్‌ నేరాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఆయనను సీసీఎస్‌ సీఐ సీహెచ్‌ మురళీకృష్ణ, వన్‌టౌన్‌ సీఐ బోణం ఆది ప్రసాద్‌, టూటౌన్‌ సీఐలు చంద్రశేఖరరావు, వర ప్రసాదరావు, పలువురు ఎస్‌ఐలు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.

Updated Date - 2023-05-15T00:16:50+05:30 IST