విద్యుత్ విజిలెన్స్ తనిఖీలు.. రూ.4 లక్షల జరిమానా
ABN , First Publish Date - 2023-09-26T00:42:33+05:30 IST
విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కైకలూరు విద్యుత్ శాఖ ఏడీ బి. రామయ్య హెచ్చరించారు.

కైకలూరు, సెప్టెంబరు 25: విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కైకలూరు విద్యుత్ శాఖ ఏడీ బి. రామయ్య హెచ్చరించారు. సోమవారం కైకలూరు రూరల్, ముదినేపల్లి మండలాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ ఈఈలు కె. వెంకటేశ్వర్లు, కమలకుమారి ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. విద్యుత్ గృహ సర్వీసులు, వాణిజ్య సముదాయలు, ఆక్వా సర్వీసులను తనిఖీ చేశారు. వీటిలో 36 సర్వీసులు అదనపు లోడు, బ్లాక్ బిల్లింగ్ ఇతర రుసుములను మొత్తం రూ.4 లక్షలు జరిమానా విధించినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ఏడీ నవీన్, ఎన్ ప్రసాద్, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.