బాలల హక్కులను కాపాడాలి
ABN , First Publish Date - 2023-03-05T00:03:23+05:30 IST
బాలలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రత్యేక పోలీస్, బాలల సంక్షేమ, ప్రత్యేక బాలల న్యాయమూర్తుల కమిటీలపై ఆధారపడి ఉందని మొదటి అదనపు జిల్లా జడ్జి పి.మంగాకుమారి అన్నారు.
మొదటి అదనపు జిల్లా జడ్జి మంగాకుమారి
ఏలూరు కలెక్టరేట్, మార్చి 4 : బాలలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రత్యేక పోలీస్, బాలల సంక్షేమ, ప్రత్యేక బాలల న్యాయమూర్తుల కమిటీలపై ఆధారపడి ఉందని మొదటి అదనపు జిల్లా జడ్జి పి.మంగాకుమారి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ప్రత్యేక బాలల పోలీస్ యూనిట్, బాలల న్యాయమూర్తుల విభాగం, సంక్షేమం ఇతర అధికారులతో పోక్సో చట్టంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. రాజ్యాంగం ప్రకారం బాలల హక్కుల పరిరక్షణకు పోక్సో చట్టం తీసుకువచ్చారన్నారు. పోక్సో స్పెషల్ జడ్జి ఎస్.ఉమాసునంద మాట్లాడుతూ పోక్సో చట్టం అమలులో అవరోధాలు రాకుండా చట్టం సూచించిన ప్రకారం పిల్లల సంరక్షణపై ప్రత్యేక బాధ్యత చేపట్టాలన్నారు. ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు మాట్లాడుతూ పిల్లల బాధ్యతను సొంత పిల్లల్లాగా స్వీకరించాలన్నారు. పర్మినెంట్ లోక్ అదాలత్ చైౖర్‌పర్సన్ ఎ.మేరీ గ్రేస్‌కుమారి, న్యాయసేవాధికార సంస్థ ఇన్‌ఛార్జి కార్యదర్శి డి.శ్రీనివాసులు, బార్ అసోసియేషన్ సెక్రటరీ సుబ్బారావు, పలు శాఖల అధికారులు, సీఐలు, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.