మాదకద్రవ్యాల నేరస్తులపై కఠిన చర్యలు

ABN , First Publish Date - 2023-07-21T00:27:35+05:30 IST

మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్న నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవా లని డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌ అన్నారు.

మాదకద్రవ్యాల నేరస్తులపై కఠిన చర్యలు
వీసీ నిర్వహిస్తున్న డీఐజీ అశోక్‌కుమార్‌

ఏలూరు రేంజ్‌ డీఐజీ అశోక్‌కుమార్‌

ఏలూరు క్రైం, జూలై 20 : మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్న నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవా లని డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌ అన్నారు. ఏలూరు రేంజ్‌ పరిధిలోని మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిర్మూలన కోసం డీస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో వీడియో కాన్ఫరెన్సును ఏలూరు జిల్లా పోలీస్‌ కార్యాలయం నుంచి గురువారం రాత్రి నిర్వహించారు. నేరస్తులకు మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్ధానంలో ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో ఎన్‌డీపీఎస్‌ కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన క్రాంతి ప్రసాద్‌, న్యాయవాది సూర్యనారాయణ మాట్లాడుతూ మారుతున్న చట్టాల పట్ల అవగాహన కల్పించారు. ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ ఉప్పాడ రవిప్రకాశ్‌, ఇతర జిల్లాల ఎస్పీలు, ఏలూరు జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ సుబ్బారావు, న్యాయసలహాదారు కె.గోపాలకృష్ణ పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-21T00:27:35+05:30 IST