నేటి నుంచి డిపార్టుమెంటల్ పరీక్షలు
ABN , First Publish Date - 2023-08-02T00:09:16+05:30 IST
జిల్లాలో బుధవారం ప్రారంభమయ్యే ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.కృష్ణవేణి అధికారులకు సూచించారు.
భీమవరం, ఆగస్టు 1 : జిల్లాలో బుధవారం ప్రారంభమయ్యే ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.కృష్ణవేణి అధికారులకు సూచించారు. మంగళవారం డీఆర్వో ఛాంబర్‌లో ఎపీపీఎస్‌సీ అధికారులు, పోలీస్, విద్యుత్, వైద్యశాఖ, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ అధికారులతో పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. సర్వీస్ డిపార్ట్మెంటల్ పరీక్షలు 2,3,4 తేదీల్లో ఉదయం, సాయంత్రం రెండు పరీక్షా కేంద్రాలలో నిర్వహిస్తారన్నారు. తాడేపల్లిగూడెం పెదతాడేపల్లి శ్రీ వాసవీ ఇంజనీరింగ్ కళాశాల,తాడేపల్లిగూడెం శశి ఇంజినీరింగ్ కాలేజీలలో పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 5 వరకు జురుగుతాయని వివరించారు. మొత్తం 851 మంది వివిధ శాఖల ఉద్యోగ అభ్యర్థులు హాజరవుతారని తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు, ఎంప్లాయి ఐడీ కార్డు తీసుకెళ్లాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయాలని ఆమె అన్నారు. పరీక్షల అనంతరం పేపర్లు బండిల్స్‌గా చేసి స్ట్రాంగ్ రూమ్‌కి పంపించాలని ఆదేశించారు. ఏపీపీఎస్‌సీ సహాయ కార్యదర్శి రాజగోపాల్, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ ఆఫీసర్లు పాల్గొన్నారు.