చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ దీక్షల హోరు
ABN , First Publish Date - 2023-09-20T00:44:26+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ వాడవాడలా నిరసనలు, రిలే దీక్షలు వెల్లువెత్తుతున్నాయి.

కొయ్యలగూడెం/దెందులూరు/కొయ్యలగూడెం/బుట్టాయగూడెం/జంగారెడ్డి గూడెం/చింతలపూడి/పోలవరం/పెదపాడు/ఉంగుటూరు/కామవరపుకోట/ ఏలూరుటూటౌన్, సెప్టెంబరు 19: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ వాడవాడలా నిరసనలు, రిలే దీక్షలు వెల్లువెత్తుతున్నాయి. కొయ్యలగూడెం మండల నాయకులు పారేపల్లి నరేష్, జ్యేష్ట రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్,రామారావు, పరిమి రాంబాబు, బొబ్బర చిన రాజు, ఆకుల అరుణ, శ్రీనివాస్‌రాజు, వివిధ గ్రామాల అధ్యక్షులు, నాయకులు మంగళవారం దీక్షలో కూర్చున్నారు. నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాస్ మాట్లా డుతూ, ఎన్నికల్లో భారీ విజయాన్ని కైవసం చేసుకుంటామని అన్నారు.
చంద్రబాబును విడుదల చేయాలని దెందులూరు నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు ఎం. రేవతి, జోగన్నపాలెం సర్పంచ్ పసుమర్తి రాజేశ్వరి డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయం వద్ద పప్పల సుశీల, సక్కు కుమారి, మహిళ నేతలతో కలిసి దీక్ష నిర్వహించారు. గారపాటి రామసీత, పెదర్ల లక్ష్మీ, శేషారత్నం, తోట ఏసమ్మ మాట్లాడారు. మాగంటి నారాయణ ప్రసాద్, మోతుకూరి నాని, గారపాటి కొండయ్య చౌదరి, యిప్పిలి వెంకటేశ్వరావు, పెనుబోయిన మహేష్ యాదవ్, ఏనుగు రామకృష్ణ పాల్గొన్నారు.
కొయ్యలగూడెంలో చేపడుతున్న రిలేనిరాహార దీక్షలకు జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు. జనసేన ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కారటం సాయిబాబు పాల్గొన్నారు. తొలుత పాదయాత్రతో తరలివచ్చిన జనసేన నాయకులు, కార్యకర్తలను నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు, పారేపల్లి రామారావు, గంగిరెడ్ల మేఘలాదేవి, గొడవర్తి విద్యాసాగర్, పారేపల్లి నరేష్, జ్యేష్ట రామకృష్ణ, శ్రీనివాసరాజు, ఆహ్వానం పలికారు.
బుట్టాయగూడెం మండలం తిమ్మాపురం నుంచి ద్వారకాతిరుమలకు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, పట్టణ నాయకులు అనుబంధ సంఘాలవారు, క్లస్టర్ ఇన్‌చార్జీలు నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. చంద్రబాబుపై అక్రమ కేసులను నిరసిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణ, మండల టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం ఎనిమిదో రోజుకు చేరాయి. కొండేటి నాగు, శివారెడ్డి హరికృష్ణ, ముత్యాల హరివెంకట శివరామకృష్ణ, పడగా శివకృష్ణ, మాండ్రు జార్జ్, అందుగుల మోహనరావు, పాకలపాటి ప్రసాద్ , బొప్పన పుల్లారావు, గంటా విల్సన్ తదితరులు దీక్షను చేపట్టారు. సాయల సత్యనారాయణ, దాసరి శ్యామ్‌సుందర శేషు, పెనుమర్తి రామ కుమార్, తూటి కుంట దుర్గారావు, తూటికుంట రాము, ముళ్ళపూడి శ్రీను, శీలం రామచంద్రరావు, గంటా రామారావు, కరణం రాంబాబు, షేక్ యాకోబ్, కొండ్రు నాగరాజ్, బోడ శ్రీను, రావూరి కృష్ణ, జయవరపు శ్రీరామమూర్తి, షేక్ ముస్తఫా, చిట్రోజు తాతాజీ, అల్లూరి రామకృష్ణ, కోటగిరి ప్రమీల, శీలం గోపి, మన్యం దుర్గారావు, బొంగు నాగేశ్వరరావు, కోలా శ్రీను పాల్గొన్నారు. దీక్షాదారులకు పరిమి సత్తి పండు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమించారు. దీక్ష శిబిరం వద్ద వరసిద్ధి వినాయకుడుకి పూజలు చేశారు. చంద్రబాబుపై కేసులు కొట్టివేయాలని, ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థించారు.
‘నేనుసైతం బాబు కోసం’ చింతలపూడి మండలం తిమ్మాపురం నుంచి ద్వారకాతిరుమల వరకు జరిగిన పాదయాత్రలో జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు నేతృత్వంలో జె.ముత్తారెడ్డి, ఎం.వెంకట్రామయ్య, అనీష్ కుమార్, థామస్, తదితరులు తరలివెళ్లారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా పోలవరం మండలం కొయ్యలగూడెంలో నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు నాయకత్వంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు మంగళవారం నాటికి ఏడో రోజుకు చేరుకోవడంతో మండల నాయకులు భారీ స్థాయిలో తరలి వెళ్లి సంఘీభావం తెలిపారు. బొడ్డు కృష్ణ, గుబ్బా రాంబాబు నాయకత్వంలో పోలవరం మండల కేంద్రం, ఎల్లండీపేట గ్రామం నుంచి వందలాదిగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వెళ్లారు. ఆకుల రాజా, జల్లేపల్లి వెంకటనరసింహారావు,మాగంటి రాము, ఇళ్ళ సత్యన్నారాయణ, చిక్కాల వెంకటేసు, బొమ్మా చిన్న కామరాజు, కుంజం సుభాషిణి పాల్గొన్నారు.
పెదపాడు మండలం అప్పనవీడులో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె చింతమనేని నవ్యశ్రీ అధ్యక్షతన కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. గారపాటి రామసీత, మోరు శ్రావణి, వడ్డి వాసవి, గుత్తా అనిల్, వేమూరి శ్రీనివాసరావు, పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఉంగుటూరులో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలలో తెలుగు యువత ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి సూర్యచంద్రరావు నాయకత్వంలో నియోజకవర్గ యువత పాల్గొన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పత్సమట్ల ధర్మరాజు ధర్మరాజు నాయకత్వంలో పార్టీ శ్రేణులు,వీర మహిళలు పాల్గొన్నారు. చింతల శ్రీనివాస్, పంది రాంబాబు, నల్లా ఆనంద్, అంబటి మాధవి, వంగా రఘు, ఇమ్మణ్ని గంగాధరావు, బొమ్మిడి అప్పారావు,కడియాల రవిశంకర్ పాల్గొన్నారు.
కామవరపుకోట మండలం తాడిచర్ల నుంచి ద్వారకాతిరుమల వరకు సర్పంచ్ పసుమర్తి పార్ధసారధిబాబు ఆధ్వర్యంలో పాకలపాటి రవి, బలుసు సాయి, బొబ్బిలి డాన్‌దివాకర్, ఖాన్ వజీర్, బొప్పన మురళీ, తక్కెళ్ళపాటి సాయి, కొప్పుల జయరాజు, వేముల హనుమంతు, గంగయ్య తరలివెళ్లారు. మోకాళ్ళపై నిలుచుని నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ఏలూరు ఆసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బడేటి చంటి ఆధ్వర్యంలో చేపలతూము సెంటర్‌లో రిలే నిరాహారదీక్షలు నిర్వహించారు.