శాస్త్రోక్తంగా ద్వాదశ కోవెల ప్రదక్షిణలు
ABN , First Publish Date - 2023-04-19T00:26:57+05:30 IST
చినవెంకన్న క్షేత్రానికి దత్తత దేవాలయ మైన లక్ష్మీపురం ఆల యంలో జరుగుతున్న శ్రీనివాసు ని కల్యాణ మహోత్సవాలు మంగళవారంరాత్రి ముగిశాయి.
ద్వారకా తిరుమల, ఏప్రిల్ 18: చినవెంకన్న క్షేత్రానికి దత్తత దేవాలయ మైన లక్ష్మీపురం ఆల యంలో జరుగుతున్న శ్రీనివాసు ని కల్యాణ మహోత్సవాలు మంగళవారంరాత్రి ముగిశాయి. ఉదయం స్వామి, అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. యాగశాలలో హోమాదిక్రతువు లను జరిపారు. ద్వాదశకోవెల ప్రదక్షిణలను, శ్రీపుష్పయాగోత్సవాన్ని (పవళింపు సేవను) అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థులు వేదమంత్రోచ్ఛరణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు.