పంటల బీమాకు మార్గదర్శకాలు జారీ
ABN , First Publish Date - 2023-12-11T00:13:06+05:30 IST
డా. వైఎస్సార్ ఉచిత పంటల బీమాను కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి పసల బీమా యోజనతో సంయు క్తంగా అమలు చేసే పథకానికి సంబంధించి 2023–24 ఖరీఫ్, రబీ సీజన్‌లో ఈ పథకాన్ని అమలు చేసే బీమా కంపెనీలు, బీమా వర్తించే పంటల వివరాలను తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఏలూరు సిటీ, డిసెంబరు 10 : డా. వైఎస్సార్ ఉచిత పంటల బీమాను కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి పసల బీమా యోజనతో సంయు క్తంగా అమలు చేసే పథకానికి సంబంధించి 2023–24 ఖరీఫ్, రబీ సీజన్‌లో ఈ పథకాన్ని అమలు చేసే బీమా కంపెనీలు, బీమా వర్తించే పంటల వివరాలను తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పథకం ద్వారా నోటిఫై చేసిన పంటలను సాగు చేసి ఈ–క్రాప్ నమోదు, ఈ–కేవైసీ పూర్తి చేసి న రైతులందరికీ ఈ–క్రాప్ రిజిస్ట్రేషన్ ఆఽధారంగా ఉచిత పంటల బీమా రక్షణ కల్పిస్తుంది. ప్రీమియం రుసుం చెల్లించనవసరంలేదు. దిగుబడి ఆధారిత పథ కం కింద జిల్లాలో ఓరియంటల్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అమలు చేస్తున్న బీమా కంపెనీగా వ్యవహరిస్తుంది. వాతావరణ ఆధారిత పథకం యూనివర్సల్ సోంపో జీఐసీ లిమిటెడ్ అమలు చేసే బీమా కంపెనీగా వ్యవహరిస్తుంది. జిల్లా లో 2023 ఖరీఫ్‌లో దిగుబడి ఆఽధారిత కింద వరికి గ్రామం యూనిట్‌గా, మిను ము జిల్లా యూనిట్‌గా, వాతావరణ ఆధారిత కింద పత్తిని మండల యూనిట్ గా తీసుకుంటారు. 2023–24 రబీ కాలానికి దిగుబడి ఆధారితంగా వరి పంటను గ్రామం యూనిట్‌గా, మొక్కజొన్న మండల యూనిట్‌గా, పెసలు మండల యూనిట్‌గా, మినుము మండల యూనిట్‌గా, 2023–24 రబీ కాలానికి వేరు శనగ, నిమ్మను మండల యూనిట్‌గా తీసుకుంటారు. నోటిఫై చేసిన జిల్లాల్లో ఖరీఫ్‌లో మిరప, పసుపు, జొన్న ఏ కేటగిరి కింద సాగైనా దిగుబడి ఆధారి తంగా, పత్తి, వేరుశనగ పంటలను వాతావరణ ఆధారితంగా పరిగణిస్తారు. నోటిఫైడ్ జిల్లాల్లో నిమ్మను వాతావరణ ఆధారిత బీమా పరిధిలోకి తీసుకొచ్చా రు. నాలుగో ఏడాది నుంచి నిమ్మ తోటలకు రబీలోను బీమా రక్షణ కల్పిస్తారు. కవరేజ్ కల్పించే కంపెనీలు, నోటిఫైడ్ పంటల వివరాలతో ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు. ఖరీఫ్ –2023 లో 15 పంటలను వాతావరణ ఆధారంగా, రబీ 2023–24లో 13 పంటల కు దిగుబడి ఆధారంగా, 4 పంటలకు వాతావరణ ఆఽధారంగా నోటిఫికేషన్ జారీ చేసింది. దిగుబడి ఆధారిత పంటలకు ఖరీఫ్‌లో గ్రామం, మండల, జిల్లా యూ నిట్‌గా బీమా కవరేజ్ కల్పిస్తుండగా, వాతావర ణ ఆధారిత పంటలకు మాత్రం మండల యూనిట్‌గా బీమా కవరేజ్ కల్పిస్తా రు. నీటి వసతి, వర్షాధారం ప్రాతి పదికన కాకుండా ఇక నుంచి పూర్తిగా వాతా వరణ, దిగుబడి ఆధారంగానే పంటలకు బీమా ఉంటుంది. నోటిఫై చేసిన జిల్లా ల్లో నోటిఫై పంటలు నష్టపోయే రైతులకు ఒకే రీతిలో పరిహారం దక్కుతుంది.