Share News

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN , First Publish Date - 2023-12-10T23:48:42+05:30 IST

తుఫాన్‌ కారణంగా నష్టపోయిన వరి రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు.

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
సీసలిలో పంటను పరిశీలిస్తున్న సీపీఎం నాయకులు

కాళ్ల, డిసెంబరు 10 : తుఫాన్‌ కారణంగా నష్టపోయిన వరి రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. సీసలి గ్రామంలో తుఫాన్‌ కారణంగా ముంపునకు గురైన భూములను సీపీఎం కాళ్ళ మండల బృందం ఆదివారం పరిశీలించింది. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి గొర్ల రామకృష్ణ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతుల పట్ల ఉదాశీన వైఖరి అలంభిస్తుందని సకాలంలో రైతులను ఆదుకోవడంలో విఫలమయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతీ రైతుకు ఎకరానికి రూ.30వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ నాయకులు మండా సూరిబాబు, యాళ్ళ లాజరు, సత్యనారాయణ, మహంకాళి, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-10T23:48:50+05:30 IST