టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు స్వాధీనం చేయాలి

ABN , First Publish Date - 2023-02-07T00:04:15+05:30 IST

జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షలు కేటాయించే వరకూ పోరాటం సాగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్‌ స్పష్టం చేశారు.

టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు స్వాధీనం చేయాలి
కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న సీపీఐ నేతలు

ఏలూరు రూరల్‌, ఫిబ్రవరి 6: జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షలు కేటాయించే వరకూ పోరాటం సాగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్‌ స్పష్టం చేశారు. టిడ్కో ఇళ్ల వద్ద సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని కోరుతూ కలెక్టరేట్‌ వద్ద సోమవారం సీపీఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. డేగా మాట్లాడుతూ చెరువులు, గుంటలు ఇళ్ల స్థలాలుగా కేటాయించడం వల్ల పునాదులకే రెండు లక్షలు ఖర్చు అవుతుందన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో రాష్ట్ర సమితి సభ్యులు ఎండి మునీర్‌, హేమశంకర్‌, పి కన్నబాబు, కె దారయ్య, బి రాము, విజయ, స్వాతి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:04:17+05:30 IST