పిల్లల చదువుపై దృష్టి పెట్టాలి

ABN , First Publish Date - 2023-09-26T00:27:55+05:30 IST

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భాగస్వామ్యం లేకుండా పాఠశాల లు అభివృద్ధి చెందవని ఏపీ స్కూల్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్స్‌ కమిషనర్‌ కాటమ నేని భాస్కర్‌ అన్నారు.

పిల్లల చదువుపై దృష్టి పెట్టాలి
పెదకాపవరం పాఠశాలను పరిశీలిస్తున్న కాటమనేని భాస్కర్‌

ఆకివీడురూరల్‌ సెప్టెంబరు 25 : తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భాగస్వామ్యం లేకుండా పాఠశాల లు అభివృద్ధి చెందవని ఏపీ స్కూల్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్స్‌ కమిషనర్‌ కాటమ నేని భాస్కర్‌ అన్నారు. పెదకాప వరం జడ్పీ పాఠశాలలో నాడు–నేడు పఽథకం ద్వారా జరిగిన అభివృద్ధి, జరుగుతున్న పనులను సోమవారం ఆయన పరిశీలించారు. తల్లిదండ్రు లు తమ పిల్లలు ఏం చదువుతు న్నారో అని పరిశీలిస్తూ, పాఠశాలకు వచ్చి తెలుసు కుంటూ ఉండాలని అన్నారు. ఎంత కష్టపడినా తమ పిల్లల భవిష్యత్‌ కోసమే అన్న విషయం గుర్తెరిగి, విద్యా భ్యాసం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. తల్లిదండ్రులు, ఉపా ధ్యాయులు సమన్వయంతో శ్రమిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఓఎస్‌డి వెంకటకృష్ణ, డీఈవో వెంకటరమణ, శ్యామ్‌సుందర్‌, యండ గండి శ్రీను, కఠారి జయలక్ష్మీ, తహసీల్దారు విజయలక్ష్మీ, ఎంపీడీవో వాణి, ఎంఈవో రవీంద్ర, హెచ్‌ఎం కాళహస్తీశ్వరుడు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T00:27:55+05:30 IST