జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి.. భీమవరంలో పర్యటన

ABN , First Publish Date - 2023-03-31T00:27:06+05:30 IST

అభివృద్ధి అంటే మాటల్లో కాదు.. చేతల్లో చూపించాలి. పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తిచేయాలి’ అని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి మునిసిపల్‌ అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి.. భీమవరంలో పర్యటన
ఆక్రమణలు తొలగించండి

భీమవరం టౌన్‌, మార్చి 30 : ‘అభివృద్ధి అంటే మాటల్లో కాదు.. చేతల్లో చూపించాలి. పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తిచేయాలి’ అని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి మునిసిపల్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె భీమవరం పట్టణంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. అండర్‌ పాస్‌ దగ్గరలో ఫుడ్‌ కోర్ట్‌ ఏర్పాటుకు స్థలాన్ని, డి మార్ట్‌ ఎదురుగా రోడ్‌ ఆక్రమణలు తొలగించిన ప్రాంతాన్ని పరిశీలించారు. సోమగుండం చెరువు, ఎడ్వర్డ్‌ ట్యాంకు సుందరీకరణ పనుల కోసం స్థల సేకరణ ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ట్రాఫిక్‌కు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. రోడ్డు మార్జిన్లు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని సూచించారు. మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.శివరామకృష్ణ, డీఈఈ టీవీ వి నారాయణరావు, టీపీవో సీతారామయ్య, ఏఈలు వై.శ్రీనివాస్‌, డి.రవితేజ, బి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T00:27:06+05:30 IST