మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించాలి
ABN , First Publish Date - 2023-07-12T00:00:38+05:30 IST
మధ్యాహ్న భోజన పథకం మెనూను పాఠశాల హెచ్‌ఎంలు ప్రతిరోజు పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు.
ఏలూరు కలెక్టరేట్, జూలై 11: మధ్యాహ్న భోజన పథకం మెనూను పాఠశాల హెచ్‌ఎంలు ప్రతిరోజు పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. 7వ డివిజన్ హిందూ బాలిక ప్రాథమికోన్నత పాఠశా లలో మధ్యాహ్న భోజన పథకా న్ని కలెక్టర్ మంగళవారం పరిశీ లించారు. వండిన భోజన పదార్థాలను స్వయంగా రుచి చూశారు. విద్యార్థులకు అందిస్తున్న ఫిల్టర్ వాటర్‌ను సేవించి సంతృప్తి వ్యక్తం చేశారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. నాడు – నేడు పథకం ద్వారా నిర్మిస్తున్న నూతన తరగతి గదులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నగర పాలక సంస్ధ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ, అదనపు కమిషనర్ బాలరాజు, కార్పొరేటర్ శ్రీనివాస నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఏలూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కలెక్టర్ పరిశీలించి విద్యార్థులకు అసౌకర్యం లేకుండా తరగతులు నిర్వహించాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. 2008లో ఏర్పాటు చేసిన డిగ్రీ కళాశాల కోటదిబ్బ జూనియర్ కళాశాల గదుల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిగ్రీ కళాశాల భవనం నిర్మాణానికి 2021లో స్ధలం కేటాయించారని తెలిపారు.