Share News

పర్యాటకంగా కొల్లేరు అభివృద్ధికి చర్యలు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2023-12-04T00:27:13+05:30 IST

కొల్లేరు అందాలు అద్భుతంగా ఉన్నాయని ఇక్కడి పర్యావరణం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తోందని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ అన్నారు.

పర్యాటకంగా కొల్లేరు అభివృద్ధికి చర్యలు : కలెక్టర్‌
బోటులో ప్రయణిస్తూ పక్షులను వీక్షిస్తున్న కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌

కైకలూరు, డిసెంబరు 3: కొల్లేరు అందాలు అద్భుతంగా ఉన్నాయని ఇక్కడి పర్యావరణం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తోందని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ అన్నారు. ఆటపాక పక్షుల కేంద్రాన్ని ఆదివారం కలెక్టర్‌ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. బోటులో షికారు చేస్తూ పక్షులను తిలకించారు. పక్షుల కేంద్రం అభివృద్ధి చర్యలపై అటవీశాఖ రేంజర్‌ కుమార్‌తో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కొల్లేరును పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. పర్యావరణ విద్యాకేంద్రం వద్ద విద్యుత్‌ను పూర్తిస్థాయిలో సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లల క్రీడా ప్రాంగ ణం పెంపు, పర్యాటకుల కోసం పార్కును ఏర్పాటు చేయాల్సి ఉంద న్నారు. పర్యావరణ విద్యాకేంద్రం వద్ద ఉన్న చిన్న నీటిగుంటలను పూడ్చివేసి ప్రహారీ నిర్మాణాన్ని చేపట్టాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. తహసీల్దార్‌ మురళీకృష్ణ, ఆర్‌ఐ ప్రసాద్‌, డీఆర్వో జయప్రకాష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-12-04T00:27:14+05:30 IST