వేగంగా గృహ నిర్మాణాలు చేయాలి: కలెక్టర్
ABN , First Publish Date - 2023-04-03T23:36:17+05:30 IST
పేదల ఇళ్ళ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయ్యాలని కలెక్టర్ పి.ప్రశాంతి గృహ నిర్మాణశాఖ అధికారులను ఆదేశించారు.
భీమవరం, ఏప్రిల్ 3 : పేదల ఇళ్ళ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయ్యాలని కలెక్టర్ పి.ప్రశాంతి గృహ నిర్మాణశాఖ అధికారులను ఆదేశించారు. భీమవరం జిల్లా కలెక్టరు క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న గృహ నిర్మాణాలపై సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరు మాట్లాడుతూ ప్రారంభించిన ఇళ్ల సంఖ్య తక్కువ ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లేఔట్లులో వారం రోజుల్లోగా లెవిలింగ్ పనులు, రోడ్డు పనులు పూర్తి చెయ్యాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో నరసాపురం సబ్ కలెక్టర్ ఎం.సూర్యతేజ, భీమవరం ఆర్డీవో దాసిరాజు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.