25న సీఎం జగన్‌ దెందులూరు రాక

ABN , First Publish Date - 2023-03-20T00:12:54+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈనెల 25న దెందులూరులో ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

25న సీఎం జగన్‌ దెందులూరు రాక
దెందులూరులో సభాస్థలం పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ

దెందులూరు, మార్చి 19 : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈనెల 25న దెందులూరులో ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం దెందులూరు, గోపన్నపాలెం గ్రామాల్లో సభా వేదిక స్థలాలను ముఖ్యమంత్రి ప్రోగాం కోఆర్డినేటర్‌ రఘురాం, జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌, ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, ఎమ్మెల్యే కొఠారు అయ్బయ్య చౌదరి, మండల వైసీపీ అధికార ప్రతినిధి కామిరెడ్డి నాని బాబు, పోకల రాంబాబు తదితరులు పరిశీలించారు.

Updated Date - 2023-03-20T00:12:54+05:30 IST