వీడని సస్పెన్స్
ABN , First Publish Date - 2023-07-20T00:24:50+05:30 IST
చింతలపూడి నియోజకవర్గానికి టీడీపీ కన్వీనర్ నియామకంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
చంద్రబాబుతో భేటీ అయిన రోషన్, అనిల్, రామారావు
ముగ్గురు నేతలతో విడివిడిగా సమావేశం
చింతలపూడి కన్వీనర్‌పై త్వరలోనే కీలక ప్రకటన
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :
చింతలపూడి నియోజకవర్గానికి టీడీపీ కన్వీనర్ నియామకంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కన్వీనర్‌గా ఎవరిని నియమించాలనే అంశంపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం నియోజక వర్గానికి చెందిన ముగ్గురు నేతలు ఆకుమర్తి రామారావు, రోషన్‌కుమార్, అనిల్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు. వారి నుంచి పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. నియో జకవర్గంలో తెలిసిన వివరాలు, వారి కుటుంబ నేపథ్యం చెప్పండంటూ అడిగారు. వనరులను ఎలా సమీకరిస్తారు ? ప్రజల్లోకి ఎలా దూసుకుపోవాలని అనుకుంటున్నారు ? పార్టీ నిర్ణయాలపై ఏ రకమైన స్పందన ఉంది ? అని ప్రశ్నించారు. ఎవరెవరి ఆర్థిక పరిస్థితి ఏ స్థాయిలో ఉందో తెలుసుకున్నారు. ఆ తదుపరి అందరూ ఆయనతో గ్రూప్ ఫొటోలు దిగారు. ముగ్గురి నుంచి పలు వివరాలను సేకరి స్తూనే భేటీ చివరిలో ‘గో ఎహెడ్’ అంటూ సాగనంపారు. చింతలపూడి వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెచ్చే దిశగానే టీడీపీ వేగంగా అడుగులు కదుపుతోంది. పార్టీలో సీనియర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తోంది. చింతలపూడికి చెందిన ముత్తారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, పార్టీ పరిశీలకుడు కోళ్ళ నాగేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ శేషు, పార్టీ సీనియర్లు, మండల బాధ్యులు చలపతి, కిలారు సత్యనారాయణ, రావూరి కృష్ణ, సాయన సత్యనారాయణ, మాటూరి వెంక ట్రావు, వెంకటేశ్వరరావుతోపాటు మరికొందరిని మరొకసారి పార్టీ కార్యాలయానికి రప్పించి వారితో భేటీ అయ్యే అవ కాశాలు లేకపోలేదు. చంద్రబాబుతో భేటీ అయిన ముగ్గురు నేతల అభిమానులు తమ నేతకే కన్వీనర్ నియా మకం ఖాయమన్నట్టు దుమారం రేపుతున్నారు. చంద్ర బాబు భేటీ అయిన ముగ్గురిలో ఒకరికి సారఽథ్య పగ్గాలు అప్పగించడం, మిగతా ఇద్దరిని సమన్వయపర్చుకుని ఉమ్మడిగా కలుపుకు వెళ్లే బాధ్యతను అప్పగించాలనే ప్రచారం జరిగినా ఇంకా కన్వీనర్ నియా మకంలో సస్పెన్స్ నెలకొనడంతో పార్టీ వర్గాలు గుక్కతిప్పు కోలేకపోతున్నాయి. సోషల్ మీడియాలో ఒకరికి కన్వీనర్ పదవి వచ్చేసింద న్నట్టుగా సమాచారం చక్కెర్లు కొడుతోంది.