చెన్నై ఎక్స్‌ప్రెస్‌కు సదరన్‌ రైల్వే రెడ్‌ సిగ్నల్‌

ABN , First Publish Date - 2023-08-02T00:02:19+05:30 IST

నరసాపురం–చెన్నైల మఽధ్య ప్రతిపాదించిన కొత్త రైలుకు సదరన్‌ రైల్వే రెడ్‌సిగ్నల్‌ వేసింది. నరసాపురంలో బయలుదేరే సమయంలో చెన్నై స్టేషన్‌లోని ప్లాట్‌ఫారాలన్నీ బీజీగా ఉన్నాయంటూ కొర్రీ వేసింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు మళ్లీ కొత్త షెడ్యూల్‌ సమయాలను మార్చి పంపేందుకు రెడీ అవు తున్నారు.

చెన్నై ఎక్స్‌ప్రెస్‌కు సదరన్‌ రైల్వే రెడ్‌ సిగ్నల్‌

కొత్త షెడ్యూళ్లను పంపుతున్న దక్షిణ మధ్య రైల్వే

నరసాపురం, ఆగస్టు 1: నరసాపురం–చెన్నైల మఽధ్య ప్రతిపాదించిన కొత్త రైలుకు సదరన్‌ రైల్వే రెడ్‌సిగ్నల్‌ వేసింది. నరసాపురంలో బయలుదేరే సమయంలో చెన్నై స్టేషన్‌లోని ప్లాట్‌ఫారాలన్నీ బీజీగా ఉన్నాయంటూ కొర్రీ వేసింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు మళ్లీ కొత్త షెడ్యూల్‌ సమయాలను మార్చి పంపేందుకు రెడీ అవు తున్నారు. జిల్లా నుంచి చెన్నై వెళ్లే ప్రయాణికుల డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రతి ఆదివారం నరసాపురం నుంచి రాత్రి 9.30 గంట లకు చెన్నైకు రైలును ప్రతిపాదించింది. విజయవాడ, గూడూరు మీదుగా ఉదయం 8 గంటలకు చెన్నై చేరి తిరిగి అక్కడ ప్రతి సోమవారం సాయంత్రం 5.30లకు బయలుదేరే విధంగా షెడ్యూల్‌ సిద్ధం చేశారు. అయితే చెన్నైలో ఫ్లాట్‌ఫారాలు ఖాళీ లేవంటూ రెడ్‌ సిగ్నల్‌ ఇవ్వ డంతో మళ్లీ కొత్త షెడ్యూళ్లు రెడీచేసే పనిలో పడ్డారు. రాత్రి 8 లేదా 9 గంటలకు బయలుదేరి ఉదయం 10 గంటలకు నరసాపురం వచ్చే విధంగా షెడ్యూల్‌ రెడీ చేస్తున్నారు. అయితే దీనిపై సదరన్‌ రైల్వే ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పాత షెడ్యూల్‌ సమయంలోనే నడిపే విధంగా అధికారులతో చర్చలు జరుపుతున్నారు. కనీసం ఆరగంట అటు ఇటులో ఆమోదం తెలిపితే ఇటు విజయవాడ, నరసాపురం వచ్చే సమయాల్లో ఎటు వంటి ఇబ్బందులు ఉండవని తెలియజేస్తున్నారు. ఇవన్నీ క్లియర్‌ అయితే గాని కొత్త ఎక్స్‌ప్రెస్‌ పట్టాలెక్కే అవకాశం లేదు.

Updated Date - 2023-08-02T00:02:19+05:30 IST