బాబు భరోసా

ABN , First Publish Date - 2023-05-12T01:00:09+05:30 IST

అన్నదాతకు తెలుగుదేశం పార్టీ అధి నేత చంద్రబాబు భరోసా కల్పించారు. అకాల వర్షాల తో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు, ప్రభు త్వంపై ఒత్తిడి పెంచేందుకు రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం ఇరగవరం వచ్చారు.

బాబు భరోసా
ఇరగవరంలో జరిగిన రచ్చబండలో మాట్లాడుతున్న చంద్రబాబు

ఇరగవరంలో టీడీపీ అధినేత రచ్చబండ

సమస్యలను ఏకరవు పెట్టిన రైతులు

అండగా ఉంటానని చంద్రన్న అభయం

సభలో అలజడి సృష్టించేందుకు వైసీపీ యత్నాలు.. అడ్డకున్న టీడీపీ శ్రేణులు

ఇరగవరం, మే 19 : అన్నదాతకు తెలుగుదేశం పార్టీ అధి నేత చంద్రబాబు భరోసా కల్పించారు. అకాల వర్షాల తో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు, ప్రభు త్వంపై ఒత్తిడి పెంచేందుకు రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం ఇరగవరం వచ్చారు. రైతులతో రచ్చబండ నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి పోరుబాట పాదయాత్ర కార్యక్రమం ఉంటుంది. తొలుత దువ్వ వద్ద చంద్రబాబుకు తణుకు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఆరిమిల్లి రాధాకృష్ణ, పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, పీతల సుజాత, కేఎస్‌ జవహర్‌, బూరుగుపల్లి శేషారావు, గన్ని వీరాంజనేయులు, అంగర రామ్మోహన్‌, కుందుల సత్యనారాయణ తదితరులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి జాతీయ రహదారి మీదుగా తణుకు పట్టణానికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా నివాసానికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిం చారు. తదుపరి ఇరగవరం వెళ్లి అక్కడ రైతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. రచ్చబండలో ఓ వ్యక్తి కేకలు వేశాడు. శాసనసభలో ఎందుకు ప్రశ్నించలేదని వ్యాఖ్యా నించారు. దీనిపై టీడీపీ అధినేత ఘాటుగా స్పందించారు. వైసీపీ కుట్రదారులు రచ్చబండ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకే కొందరు వ్యక్తులను పంపుతూ ఉంటారని మండపడ్డారు. వైసీపీ ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తోందన్నారు. రైతులను ఆదుకోవాల్సింది పోయి కొందరు వ్యక్తుల ద్వారా టీడీపీ కార్యక్రమాలను భగ్నం చేసేందుకు కుయుక్తులు పన్నుతుందని చెప్పారు. ఈలోగా కేకలు వేసిన వ్యక్తిని పోలీసులు, టీడీపీ నాయకులు అక్కడ నుంచి పంపించి వేశారు. దీంతో వివాదం సద్దుమనిగింది. ఆపై ఒక్కొక్కరు తమ కష్టాలను ఏకరవు పెట్టారు. టీడీపీ పాలనలో ఎలా ఉంది ? వైసీపీ పాలన వచ్చిన తర్వాత తాము ఎలాంటి కష్టాలను అనుభవిస్తున్నామో చెప్పుకొచ్చారు. ప్రభుత్వం, వ్యాపారులు, దళారుల చేతుల్లో మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో లోపాలను ప్రతీ రైతు ఎత్తి చూపారు. ఏ ప్రభుత్వంలో ఇటువంటి కష్టాలను చూడలేదని ఆవేదన వెలిబుచ్చారు. రైతులను చంద్రబాబు ఓదార్చారు. ఎవరూ నిరుత్సాహ పడవద్దని రాబోయేది మన ప్రభుత్వమేనని భరోసా కల్పించారు. గురువారం రాత్రి 7.45 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం 9.30 వరకు కొనసా గింది. తణుకు నియోజకవర్గంలో తొలిరోజు చంద్రబాబు పర్య టన విజయవంతమైంది. రచ్చబండ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బస్సులోనే బస చేశారు.

నేడు పోరుబాట పాదయాత్ర

శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు ఇరగవరం మద్ది ఆంజనేయస్వామి ఆలయం నుంచి గోటేరు, గోపాలపురం, కొమరవరం, ఇరగవరం కాలనీ తదితర గ్రామాలలో పోరుబాట పాదయాత్ర నిర్వహించి రైతులను పరామర్శిస్తారు. అనంతరం తణుకు మునిసిపల్‌ కార్యాలయం, నరేంద్ర, వెంకటేశ్వర థియేటర్‌ మీదుగా తేతలి ఆకుల శ్రీరాములు డిగ్రీ కళాశాల కు చేరుకుని, భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పాదయాత్ర జరిగే ప్రాంతం వెంబడి అధినేతకు అపూర్వ స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇరగవ రం నుంచి తణుకు వరకు భారీ ప్లెక్సీలు, పసుపు తోరణాలతో రహదారులను అలంకరించారు. అనేక గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు చేరుకుని చంద్రబాబును అనుసరించేలా రాధాకృష్ణ పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. గురువారం ఏర్పాట్లను ఆరిమిల్లితోపాటు, తోట సీతారామలక్ష్మి, బూరుగుపల్లి శేషారావు, గన్ని వీరాంజనేయులు పరిశీలించారు. పాదయాత్రలో ఎటువంటి అపశ్రుతి జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

Updated Date - 2023-05-12T01:00:09+05:30 IST