కేంద్రమే కులగణన చేపడితే బాగుంటుంది
ABN , First Publish Date - 2023-11-21T00:03:35+05:30 IST
కేంద్ర ప్రభు త్వమే సమగ్ర కుల గణన జరిపితే బాగుం టుందని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్య క్రమం చేపట్టినందున ప్రజలు సహకరిం చాలని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజ్ అన్నారు. ఈనెల 27వ తేదీ నుంచి జిల్లాలో నిర్వహిస్తున్న ఈ సర్వేకు ప్రజలు అన్ని వివరాలను అందించాలని విజ్ఞప్తి చేశారు.

శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు
భీమవరం, నవంబరు 20 : కేంద్ర ప్రభు త్వమే సమగ్ర కుల గణన జరిపితే బాగుం టుందని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్య క్రమం చేపట్టినందున ప్రజలు సహకరిం చాలని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజ్ అన్నారు. ఈనెల 27వ తేదీ నుంచి జిల్లాలో నిర్వహిస్తున్న ఈ సర్వేకు ప్రజలు అన్ని వివరాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజ నీరింగ్ కళాశాల ఆడిటోరియంలో సమగ్ర కులగణన సర్వేపై సోమవారం నిర్వ హించిన రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్‌లో మోషేన్‌రాజ్ పాల్గొని మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి ఈ కులగణన ఉపకరిస్తుంద న్నారు. దేశంలో చివరిసారిగా స్వాతంత్ర్యానికి పూర్వం 1931లో కులగణనతో జనగణన జరిగిందని, దాదాపు ఒక శతాబ్దకాలం తరువాత బిహార్, తరువాత రెండోరాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ ఇపుడు చేస్తున్నది కేవలం సర్వే మాత్రమే అని దీని ద్వారా ఒక కుటుంబం, ఆర్థిక, సామాజిక స్థితి గతులను గుర్తింస్తారన్నారు. వలంటీరు, సచివాలయ సిబ్బందికి కుటుంబ యజమాని, సభ్యులు చెప్పే కుల వివరాలనే యాప్‌లో నమోదు చేస్తారని, ఎటువంటి కుల ధృవపత్రాలు చూపనవసరం లేదన్నారు. ఈ నెల 27 నుంచి వారం రోజుల పాటు ఈ ప్రక్రియను ప్రత్యేక శిక్షణ కల్పించిన గ్రామ, వార్డు వలంటీరు, సచి వాలయ సిబ్బంది సమన్వయంతో ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా నిర్వహించనున్నట్టు తెలిపారు. జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి శ్రీనివాసరావు కులగణన ఆవశ్యకత, నిర్వహించే విధానం గురించి వివరించారు. ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లెం ఆనంద్ ప్రకాష్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి రాజారావు, వెలమ కమిషన్ గూడూరు శ్రీనివాసరావు, శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య, సగర కార్పొరేషన్ సభ్యుడు కర్ణయ్య మాట్లాడారు.