యువత భవిష్యత్‌కు చంద్రబాబు భరోసా

ABN , First Publish Date - 2023-05-31T23:16:00+05:30 IST

రక్తాన్నైనా ధారపోస్తాం తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకువస్తామని యువత ముందుకు వస్తోందని, రాష్ట్రంలో యువత భవిష్యత్‌కు చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ అన్నారు.

యువత భవిష్యత్‌కు చంద్రబాబు భరోసా
రక్త దాన శిబిరంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

ఎమ్మెల్యే నిమ్మల, మాజీ ఎమ్మెల్సీ అంగర

తెలుగు యువత ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం

పాలకొల్లు అర్బన్‌, మే 31 : రక్తాన్నైనా ధారపోస్తాం తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకువస్తామని యువత ముందుకు వస్తోందని, రాష్ట్రంలో యువత భవిష్యత్‌కు చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ అన్నారు. స్థానిక అంబేడ్కర్‌ భవన్‌లో బుధవారం తెలుగు యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్సీ అంగర మాట్లాడుతూ యువతకు జగన్‌ ఇచ్చిన జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ అని ప్రశ్నించారు. డీఎస్సీ నాలుగేళ్లుగా కనపడడం లేదని, ఇక పారిశ్రామిక వేత్తలు పొరుగు రాష్ట్రాలకు తరలి పోయే పరిస్థితిని జగన్‌ తీసుకువచ్చారని విమర్శించారు. ఈ నేపథ్యంలో మహానాడులో ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు 20 లక్షల ఉద్యోగాలు సృష్టించి ఇస్తానని, నిరుద్యోగ భృతిని రూ.3 వేలు ఇస్తానని ప్రకటించి వారి భవితకు భరోసా ఇచ్చారన్నారు. భద్రత తొలగిస్తే చంద్రబాబు ఫినిష్‌ అన్న స్పీకర్‌ సీతారామ్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని లేకుంటే యువత వదిలే గాలికే కొట్టుకుపోతాడన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు 24 మంది రక్త దానం చేశారు. తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కర్నేన రోజారమణి, రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, నాయకులు కర్నేన గౌరునాయుడు, గండేటి వెంకటేశ్వరరావు, కోడి విజయభాస్కర్‌, జి.సూర్యనారా యణరాజు, మామిడిశెట్టి పెద్దిరాజు, అల్లం తాతాజీ, తెలుగు యువత నియోజక వర్గ నాయకులు అంగర వీరభద్రకుమార్‌ (చిన్న), మండాది అవినాష్‌, బొప్పన చిట్టినాయుడు, పీతల శ్రీనివాస్‌, గుబ్బల ప్రసాద్‌, కడలి గోపాలరావు, కొండేటి నరేష్‌, సంకు సుబ్రహ్మణ్యం, జల్లి ఏసు, చిలుకూరి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకం..

తాడేపల్లిగూడెం అర్బన్‌, మే 31: అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మేనిఫెస్టోను ప్రకటించారని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి అన్నారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం పట్టణంలోని శేషమహల్‌ సెంటర్‌లో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద చంద్రబాబు చిత్రపటానికి మహిళలు పాలభిషేకం చేశారు. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగు రైతు ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి ధాన్యాభిషేకం చేశారు. గొర్రెల శ్రీధర్‌, పట్నాల రాంపండు, దాసరి కృష్ణవేణి, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, ముత్యాల శ్రీనివాస్‌, చెప్పుల వాసు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:16:00+05:30 IST