పార్టీ పటిష్ఠతకు కృషి చేయండి
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:17 AM
బూత్ స్థాయిలో పార్టీ పటిష్టానికి కార్యకర్తలు కృషి చేయాలి. ప్రతి కార్యకర్త తమ ఓటుతో పాటు మరో నలుగురి చేత బీజేపీకి ఓటు వేసేలా పనిచేయాలి. కార్యకర్తలందరూ సమష్టిగా కృషి చేసి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చేలా కష్టపడాలి
కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పిలుపు
జంగారెడ్డిగూడెంలో స్వశక్తీకరణ జిల్లా సమావేశానికి హాజరు
జంగారెడ్డిగూడెం, డిసెంబరు 16 : ‘బూత్ స్థాయిలో పార్టీ పటిష్టానికి కార్యకర్తలు కృషి చేయాలి. ప్రతి కార్యకర్త తమ ఓటుతో పాటు మరో నలుగురి చేత బీజేపీకి ఓటు వేసేలా పనిచేయాలి. కార్యకర్తలందరూ సమష్టిగా కృషి చేసి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చేలా కష్టపడాలి’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెంలోని దొండపూడి రామలక్ష్మి కల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన బీజేపీ బూత్ స్వశక్తీకరణ జిల్లా సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన నిధులు గురించి ప్రజలకు వివరంగా కార్యకర్తలు తెలపాలన్నారు. ప్రతి బూత్‌కు కమిటీలను జనవరి 5వ తేదీ నాటికి పూర్తి చేయాలని జిల్లా నాయకులను ఆదేశించారు. తొలుత పర్యటకు వచ్చిన పురందేశ్వరికి బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. పుట్లగట్లగూడెం వద్ద నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనులను ఆమె సందర్శించి అధికారులతో సమావేశమై రహదారి నిర్మాణం పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి దండమూడి కల్యాణ మండపానికి బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా తరలివెళ్లారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, సాగి కాశీ విశ్వనాథరాజు, జిల్లా అధ్యక్షుడు చౌటపల్లి విక్రమ్ కిషోర్, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మల కిషోర్, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొడియం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే అనిత కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోంది...
సమావేశం అనంతరం పురందేశ్వరి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం లో అవినీతి రాజ్య మేలుతోందన్నారు. ఏపీలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేటాయించిన నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.525 కోట్లు ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి ఇవ్వగా 25 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. గ్రీన్‌ఫీల్డ్ హైవేకు సంబంధించి రేచర్ల నుంచి గుర్వాయిగూడెం 27 కిలోమీటర్లకు రూ.500 కోట్లు, గుర్వాయి గూడెం నుంచి దేవరపల్లి వరకు 29 కిలోమీటర్లకు రూ.600 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. భారత్‌మాల ఫేజ్ –1 కింద రూ.2,092 కోట్లతో గుండుగొలను నుంచి దేవరపల్లి మీదుగా కొవ్వూరు వరకు నాలుగు వరు సల హైవే నిర్మాణంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు. జిల్లాకు లక్షకు పైగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన మంత్రి ఆవాస యోజన కింద ఇళ్లు కేటాయించిందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత మందికి ఆ ఇళ్లు కట్టించి ఇచ్చారో జవాబు ఇవ్వాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్లకు సంబంధించి ఒక్క పైసా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. జగనన్న కాలనీల పరిస్థితి అందరికీ తెలుసన్నారు. జిల్లాలో 6,77లక్షల మందికి ఉపాధి కల్పించామన్నారు. చిరు వ్యాపారులు 4,212 మందికి రూ.10 వేలు చొప్పున రుణాలు అందించామన్నారు. అమృత పఽథకంలో ఏలూరు కార్పొరేషన్‌లో రూ.2.50 కోట్లతో 6,110 కొత్త నీటి కనెక్షన్‌లను కేంద్రం సహాయంతో సాధ్యపడిందన్నారు. నాణ్యత లేని మద్యాన్ని పేదలతో తాగించారని మొదట బయట పెట్టిందే బీజేపీ ప్రభుత్వమన్నారు. తుఫాన్ కారణంగా జరిగిన వరి, పొగాకు నష్టాలను నిర్మల సీతారామన్ దృష్టికి తీసుకెళ్లామ న్నారు. బీజేపీ,జనసేన మిత్రపక్షంగానే వెళ్తామన్నారు.
––––––––––––––––––