బస్టాండ్‌ గోతులమయం

ABN , First Publish Date - 2023-06-02T23:59:10+05:30 IST

భీమడోలు జంక్షన్‌లో ఆర్టీసీ బస్సులు నిలిచే బస్టాండ్‌ గోతులమయం కావడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు.

బస్టాండ్‌ గోతులమయం
బస్టాండ్‌ ఆవరణలో గోతులు

భీమడోలులో ప్రయాణికులకు తప్పని తిప్పలు

భీమడోలు, జూన్‌ 2: భీమడోలు జంక్షన్‌లో ఆర్టీసీ బస్సులు నిలిచే బస్టాండ్‌ గోతులమయం కావడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. బస్సు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కావడంతో ప్రయాణికులు ఆదమరుపుగా ఉంటే ప్రమాదాల బారిన పడక తప్పదు. జిల్లా నలు మూలల నుంచి ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లే బస్సులు భీమడోలు జంక్షన్‌లోని బస్టాండ్‌ మీదుగా ప్రయాణించాల్సి ఉంది. దూర ప్రాంతాల నుంచి ప్రయాణికులు బస్టాండ్‌లో ద్వారకా తిరుమలకు వెళ్ళే బస్సులు ఎక్కుతారు. బస్టాండ్‌ ఆవరణ అంతా భారీ గోతులు ఏర్పడడంతో బస్టాం డ్‌లోకి వెళ్ళేందుకు బస్సులు నానా పాట్లు పడుతున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వర్ష పడితే గోతులు మరింత ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉందని భక్తులు వాపోతున్నారు. ప్రతి సంవత్సరం బస్టాండ్‌ ప్రాంగణంలో తాత్కాలిక పనులు చేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కార దిశగా అధికారులు ఆలోచించడం లేదని ఈ ప్రాంగణం అంతా సిమెంటు రోడ్డు వేస్తేనే తప్ప ఇబ్బందులు తప్పవని భక్తులు కోరుతున్నారు. బస్టాండ్‌ ప్రాంగణంలో చెత్త పేరుకుపోయి అపారిశుధ్యం ఏర్పడుతుందని భక్తులు వాపోతున్నారు. ద్వారకాతిరుమల ఆలయ దేవాలయ శాఖ పరిధిలో ఉన్న అధికారులు స్పందించి బస్టాండ్‌ సమస్యలు పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు.

Updated Date - 2023-06-02T23:59:10+05:30 IST