బీసీ కులగణన చేపట్టాలి

ABN , First Publish Date - 2023-04-11T23:50:43+05:30 IST

రాష్ట్ర జనాభాలో బీసీలు సగానికంటే ఎక్కువగా ఉన్నారని, బీసీల కులగణన చేపట్టాలని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

బీసీ కులగణన చేపట్టాలి
బీసీల సమ్మేళనంలో మాట్లాడుతున్న పితాని సత్యనారాయణ

జంగారెడ్డిగూడెం టౌన్‌, ఏప్రిల్‌ 11: రాష్ట్ర జనాభాలో బీసీలు సగానికంటే ఎక్కువగా ఉన్నారని, బీసీల కులగణన చేపట్టాలని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగాభవాని కల్యాణ మండపంలో మంగళ వారం బీసీల ఆత్మీయ సదస్సు జరిగింది. బీసీ సాధికార సమితి ఆధ్వర్యం లో అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ దాసరి శ్యామ్‌ చంద్రశేషు అధ్యక్షతన, టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి చిట్టిబోయిన రామ లింగేశ్వరరావు పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ సందర్భంగా పితాని మాట్లాడుతూ, రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో గతంలో వున్న 34 శాతాన్ని వైసీపీ ప్రభుత్వం 24 శాతానికి తగ్గించిందని, దాన్ని జనాభా ప్రకారం పెంచి బీసీలకు చట్ట సభలలో ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఎవరైనా బీసీలను తక్కువగా చూస్తే వారి రాజకీయ మనుగడను భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష మాట్లాడుతూ, బీసీలంతా సంఘటిత మై ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలు రాజ్యాధికారంవైపు అడుగులు వేయాలన్నా రు. బీజేపీ క్రమశిక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాకా సత్యనారాయణ మాట్లాడుతూ, కులగణనతో పాటు రిజర్వేషన్లు సాధించుకోవాల్సిన ఆవశ్యకత బీసీలకు ఉందన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు, శెట్టిబలిజ సాధికార రాష్ట్ర కన్వీనర్‌ కుడిపూడి సత్తిబాబు, శ్రీశయన సాధికార రాష్ట్ర కన్వీ నర్‌ పట్నాల వెంకటేష్‌బాబు, బీసీ సెల్‌ రాష్ట్ర ఉపా ధ్యక్షులు కరణం పెద్దిరాజు, అతిరాస రాష్ట్ర కన్వీనర్‌ శుక్లబోయిన సత్యనారాయణ, రాష్ట్ర ఎంబీసీ సాధికా ర కన్వీనర్‌ పెండ్ర రమేష్‌, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యనిర్వ కార్యదర్శి కొండపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-11T23:50:43+05:30 IST