నాణ్యత లోపించిన జగనన్న ఇళ్లు
ABN , First Publish Date - 2023-07-01T00:16:59+05:30 IST
ఉచితంగా ఇళ్లు నిర్మిస్తామని జగనన్న కాలనీ లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం దుర్మార్గమని ఏలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ బడేటి చంటి అన్నారు.
లబ్ధిదారుల నుంచి డబ్బు వసూళ్లు దుర్మార్గం : బడేటి చంటి
ఏలూరుటూటౌన్, జూన్ 30: ఉచితంగా ఇళ్లు నిర్మిస్తామని జగనన్న కాలనీ లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం దుర్మార్గమని ఏలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ బడేటి చంటి అన్నారు. లక్ష్మీపురంలోని జగనన్న కాలనీల ను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో జగనన్న ఇళ్లు నిర్మించడం అనాలోచితమైన చర్య అని అన్నారు. ఉచితంగా ఇళ్ళు నిర్మిస్తామని చెప్పి ఇప్పుడు ఒక్కొక్క లబ్ధిదారుడి నుంచి రూ.35వేలు ఎలా వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. కట్టడాల్లో నాణ్యత లోపించిందన్నారు. నగరం నుంచి ఇంటి నిర్మాణం చేసుకునేందుకు వెళ్ళాలంటే లబ్ధిదారులకు రూ.400 ఖర్చవుతుందన్నారు. లబ్ధిదారులతో నిమిత్తం లేకుండా ఉచితంగా అన్ని వసతులతో కూడిన ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.