Share News

ఓటు హక్కు వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2023-11-28T23:28:34+05:30 IST

ప్రతీ ఒక్కరూ ఓటుహక్కు విని యోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ లావణ్యవేణి అన్నారు.

ఓటు హక్కు వినియోగించుకోవాలి
భీమడోలు జంక్షన్‌లో విద్యార్థుల మానవహారం

ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమాలు

ఏలూరు ఎడ్యుకేషన్‌, నవంబరు 28: ప్రతీ ఒక్కరూ ఓటుహక్కు విని యోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ లావణ్యవేణి అన్నారు. ఓటుహక్కు విలువ, సద్వినియో గంపై ‘స్వీప్‌’ కార్యాచరణలో భాగంగా మంగళవారం సీఆర్‌ఆర్‌ కళాశాల ఆడిటోరియంలో విద్యార్థులకు ర్యాలీ, సదస్సు జరిగాయి. ఆమె మాట్లాడుతూ 18 ఏళ్ల వయస్సు దాటిన వారంతా ఓటు నమోదుకోసం కళాశాలలో ఫాం 6 అందుబాటులో ఉంచామన్నారు. ఆన్‌లైన్‌లో కూడా ఓటుహక్కు నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఓటరు నమోదును మరింత చైతన్యవంతం చేసేందుకు విద్యార్దులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని కోరారు. జడ్పీ సీఈవో సుబ్బారావు మాట్లాడుతూ డిసెంబరు 2, 3 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రతీ పోలింగ్‌ స్టేషన్‌వద్ద నిర్వహించ నున్నామన్నారు. కార్పొరేషన్‌ కమిషనర్‌ వెంకటకృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్‌ రామరాజు, తహసీల్దార్‌ సోమశేఖర్‌, ఎంపీడీవో ప్రణవి పాల్గొన్నారు. విద్యార్థుల ర్యాలీ కళాశాలనుంచి ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌వరకు కొనసాగింది. ఓటుహక్కు వినియోగించుకుంటామని విద్యార్దులతో ప్రతిజ్ఞ చేయించారు.

పెదపాడు: 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమో దు చేయించుకోవాలని తహసీల్దారు జి.విజయకుమార్‌రాజు తెలిపారు. ఓటు ప్రాధాన్యంపై అవగాహన కల్పిస్తూ సత్రంపాడు–వట్లూరు మధ్య విద్యార్థుల తో అవగాహన ర్యాలీని మంగళవారం నిర్వహించారు. ఓటు ప్రాధాన్యతపై విద్యార్థులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో వి.సత్యనారాయణ, రాంబాబు, కోటేశ్వరరావు, నరసింహా, రవికుమార్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

భీమడోలు : ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు హక్కును పొందాలని ఎలకో్ట్రరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, ఆర్డీవో ఖాజావలి అన్నారు. భీమడోలు శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఎలకో్ట్రలర్‌ రిజిస్ట్రేషన్‌ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆర్డీవో ఖాజావలి విద్యార్థులకు ఓటు హక్కు ప్రాధాన్యం వివరించారు. అనంతరం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి, భీమడోలు జంక్షన్‌ లో మానవహారం నిర్వహించారు. బీఎల్‌వోలకు ఎలకో్ట్రరల్‌ రిజిస్ట్రేషన్‌ విధి నిర్వహణపై పలు సూచనలు ఇచ్చారు. తహసీల్దార్‌ ఇందిరాగాంధీ, ఎంపీ డీవో పద్మావతి దేవి, విద్యార్థులు, బీఎల్‌వోలు, తదితరులు పాల్గొన్నారు.

నిడమర్రు: యువత ఓటు నమోదు చేసుకోవాలని ఆర్డీవో ఖాజావలీ అన్నారు. భువనపల్లి కళాశాల విద్యార్ధులతో కలసి రెవెన్యూ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిగ్రీ కళాశాల విద్యార్థులతో ర్యాలీ, మానవహరం నిర్వహించారు. తహసీల్దార్‌ బి.సాయిరాజ్‌, ఎంపీడీవో విజయ కుమారి, ఆర్‌ఐ సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-28T23:28:36+05:30 IST