బుట్టాయగూడెం సర్పంచ్ వెంకాయమ్మకు జాతీయ అవార్డు
ABN , First Publish Date - 2023-03-05T00:20:45+05:30 IST
జలశక్తి అభియాన్ కింద రూఫ్ టాప్ వాటర్ హార్వె స్టింగ్, సంప్రదాయ వర్షపు నీటి సేకరణ నిర్మాణాలు చేపట్టినందుకు ఏలూరు జిల్లాకు చెందిన బుట్టాయి గూడెం సర్పంచ్ తెల్లం వెంకాయమ్మకు జాతీయ స్థాయి అవార్డు దక్కింది.
న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి షెకావత్ నుంచి స్వీకారం
ఏలూరు సిటీ/బుట్టాయగూడెం, మార్చి 4 : జలశక్తి అభియాన్ కింద రూఫ్ టాప్ వాటర్ హార్వె స్టింగ్, సంప్రదాయ వర్షపు నీటి సేకరణ నిర్మాణాలు చేపట్టినందుకు ఏలూరు జిల్లాకు చెందిన బుట్టాయి గూడెం సర్పంచ్ తెల్లం వెంకాయమ్మకు జాతీయ స్థాయి అవార్డు దక్కింది. దేశవ్యాప్తంగా 36 మందికి ఈ అవార్డులు అందించగా రాష్ట్రంలో ఈ అవార్డు ఏలూరు జిల్లాకు మాత్రమే దక్కడం విశేషం. న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్న స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్–2023 ఉమెన్ లీడర్ షిప్ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేందర్ సింగ్ షెకావత్ చేతుల మీదుగా వెంకాయమ్మ అవార్డు స్వీకరించారు. జలశక్తి అభి యాన్‌లో తన ఆదర్శవంతమైన పనితీరు, విశిష్ఠ సహకారాన్ని అందించినందుకు, అంతర్జాతీయ ఉమె న్స్ డేను పుర స్కరించుకుని ఈ అవార్డును అందు కున్నారు. మహా త్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాఽధి హామీ పథకం ద్వారా నీటి సేకరణ, రక్షణ పనులు చేపట్టినందుకు జిల్లాకు ఈ అవార్డు దక్కిం ది. ఆమెతోపాటు ఈ కార్యక్రమంలో జిల్లా డ్వామా ప్రాజెక్టు డైరక్డర్ దుండి రాంబాబు, జంగారెడ్డిగూడెం క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ కె.ప్రపుల్లకుమార్, గ్రామ పంచాయతీ సెక్రటరీ జె.కిరణ్ పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ వెంకాయమ్మను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జేసీ అరుణ్‌బాబు అభినందించారు.
గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ఐదు నీటిపారు దల పునరుద్దరణ పనులు, పది లక్షల క్యూబిక్ మీట ర్ల నిల్వ సామర్ధ్యం సృష్టించారు. రూ.1.30 కోట్లతో వాటర్‌షెడ్డు అభివృద్ధి, నాలుగు తాగునీటి ట్యాంకుల డీసిల్టింగ్ పనులు, నాలుగు ఓవర్ హెడ్ వాటర్ స్టోరేజీ ట్యాంకులు, ఆరు పశువుల చెరువుల పను లు, రెండు చెక్ డ్యాం పనులను నిర్వహించారు. రైతుల భాగస్వామ్యంతో ఎనిమిది చెరువులను వినూత్న రీతిలో అభివృద్ధి చేశారు.